రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

తూప్రాన్ ముద్ర :-మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జాతీయ రహదారి పై టిప్పర్ లారీ డికొని ఇద్దరు పిల్లలు, తల్లి దుర్మారణం చెందిన ఘటన చోటుచేసుకుంది.మేడ్చల్ వైపు నుండి తూప్రాన్ వైపు స్కూటీ పై మహిళా తన ఇద్దరు పిల్లలతో కలిసి వస్తుండగా కాళ్లకల్ బ్యాంకు సమీపంలో వెనకనుండి వచ్చిన గుర్తుతెలియని టిప్పర్ లారీ డికొనడం తో తల్లి కొడుకు కూతురు ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.ఘటన స్థలాన్ని తూప్రాన్ సీఐ శ్రీధర్ సందర్శించి ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.