బిసి కులవృత్తుల వారు దరఖాస్తూ చేసుకోండి కలెక్టర్ రాజర్షి షా

బిసి కులవృత్తుల వారు దరఖాస్తూ చేసుకోండి కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్: వెనుకబడిన వర్గాలకు చెందిన 11 కులవృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్ధిక సాయం కోసం ఆన్ లైన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వెనుకబడిన వర్గాలకు చెందిన అన్ని కులవృత్తులు, చేతి వృత్తులు వారికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆర్థిక సాయం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించడానికి వెబ్ సైట్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులాల (బిసి - ఎ,బి,డి) వారు ఆర్ధిక సహాయం కోసం కుల, ఆదాయ ధృవీకరణ పత్రములు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్, వివరములతో ఆన్ లైన్ లో tsobmms.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దిగువ చూపిన నియమనిబంధనలతో జూన్, 20 లోపు దరఖాస్తూ చేసుకోవాలని జిల్లా కలెక్టర్  రాజరి షా తెలిపారు. 

వయస్సు జూన్ 2023 నాటికి 18 నిండి 55 సం.రాలలోపు ఉండాలని, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో 1,50,000,పట్టణ ప్రాంతాలలో 2,00,000, వార్షిక ఆదాయం కల్గిన వారు అర్హులన్నారు. కుటుంటానికి ఒకరు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తు తేదీ నుండి గత 5 సంవత్సరముల లోపు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థిక లబ్ది పొందినవారు. 2017-18 లో రూ. 50,000 రూపాయలు లబ్ది పొందినవారు అర్హులు కాదన్నారు. ఆన్ లైన్ దరఖాస్తులు ఈనెల 20 వరకు సమర్పించాలన్నారు. ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి కుల, ఆదాయ ధృవీకరణ పత్రములు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ ఫోర్టు సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్ బుక్ లతో జతపరిచి సంబంధిత మండల పరిషత్,  మున్సిపల్ కార్యాలయాలలో అందజేయాలని వివరించారు