వనదుర్గ  ప్రాజెక్ట్ నుండి దిగువకు 9237 క్యూసెక్కుల నీరు

వనదుర్గ  ప్రాజెక్ట్ నుండి దిగువకు 9237 క్యూసెక్కుల నీరు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో గల ఏకైక మధ్య తరహా నీటి ప్రాజెక్టు అయిన వనదుర్గ ప్రాజెక్టు (ఆనకట్ట) పొంగి పొర్లుతుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి వస్తున్న వరదతో నిండుకుండలా పొంగుతుంది. గురువారం ఉదయం 7 గంటలకు 9237  క్యూసెక్కుల నీరు మంజీరా నదిలో దిగువకు వెళ్తున్నట్లు మెదక్ ఇరిగేషన్ డిఈ శివనాగరాజు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.