ప్లాస్టిక్ నిర్మూలనతోనే మనుగడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ప్లాస్టిక్ నిర్మూలనతోనే మనుగడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర, తూప్రాన్: ప్లాస్టిక్ నిర్ములనతోనే మానవ మనుగడ సాధ్యమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని పారిశ్రామిక వాడలో నూతనంగా ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ రహిత జీవ పదార్థాలతో కూడిన బ్యాగ్ తయారీ ఏఐసిఎంటి పరిశ్రమ ను రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, సినీ నటుడు ఆలీ, డిఆర్డీఓ శాస్త్రవేత్త వీరబ్రహ్మంలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ ను రూపుమాపాలంటే ఇలాంటి జీవ పదార్థాలను ఉపయోగించి  బ్యాగుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసిన మౌలాలి, షేక్ జానీలను అభినందించారు. రాబోయే రోజులలో ఇలాంటి ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని సూచించారు. ప్లాస్టిక్ ఉపయోగం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. ఏఐసిఎంటి పరిశ్రమలో జీవ పదార్థాలతో తయారైన వస్తువులు 90 నుండి 120 రోజుల వ్యవదిలో భూమిలో కరిగి పోతాయని డిఆర్డీఓ శాస్త్రవేత్త వీరబ్రహ్మం అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ యాజమాన్యం సభ్యులు షేక్ షరీఫ్, హఫ్రిజ్, హాసిన్, సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు బాబు, భానుప్రియ, తదితరులు పాల్గొన్నారు.