పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్​లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య  జరుపుకొన్నారు. ఆదివారం పదవ తరగతి 1993–1994 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మెదక్ గణేష్​ స్టడీ పాయింట్​ ట్యూషన్​ విద్యార్థులు 30 సంవత్సరాల తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు కలుసుకొన్నారు. ఈ సందర్భంగా  చిన్నచిన్న కొట్లాటలను తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు.  ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే ముప్పై ఏళ్ళ క్రితం బోధించిన ఉపాధ్యాయులు శ్రీహరి, దత్తాత్రేయ కులకర్ణి, శ్రీనివాస్​, ప్రసాద్​, నారాయణరెడ్డిలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందచేశారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు.