దేశ ప్రజలు బీజేపీ పీడను వదిలించుకోవాలి - సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి. వి. రాఘవులు

భువనగిరి మార్చి 28 (ముద్ర న్యూస్) ప్రజల్లో మత విద్వేషాలను ప్రేరేపించి బిజెపి అధికారంలోకి రావాలని చూస్తుందని రామన్న కాలంలో దేశ ప్రజలందరూ బిజెపి పీడను వదిలించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు -(సిపిఐఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు.మంగళవారం రోజున మార్చి మొదటి వారంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన జన చైతన్య యాత్ర మంగళవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకుంది ఈ సందర్బంగా యాత్రకు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డప్పు, కోలాటాల కళాకారుల నృత్యాలతో జిల్లా కేంద్రానికి చేరుకున్న యాత్రకు సాదర స్వాగతం పలికారు.

భువనగిరి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన జనచైతన్య యాత్ర ర్యాలీ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా మీదుగా భువనగిరి బంజారాహిల్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభ స్థలానికి చేరుకుంది.ర్యాలీలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు యాత్ర రథసారథి ఎస్ వీరయ్య మరియు బృంద సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో బీవీ రాఘవులు మాట్లాడుతూ దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో బిజెపి పీడను వదిలించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి బి ఆర్ఎస్ మాత్రమే పని చేస్తున్నదని కాంగ్రెస్ తన స్థాయికి తగ్గ పోరాటం చేయట్టం లేదని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వల్ల సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

నూతనంగా నిర్మించిన అమరజీవి దుంపల మల్లారెడ్డి స్మారక భవనాన్ని, షాపింగ్ కాంప్లెక్స్ ను, ప్రజా సంఘాల ఆఫీసులను, జనరిక్ మెడికల్ షాప్ ను, తిరందాసు గోపి మీటింగ్ హాల్ లను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి అతిధులుగా మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నర్సింహా రెడ్డి జూలకంటి రంగారెడ్డి లో జన చైతన్య యాత్ర రథసారథి ఎస్ వీరయ్య బృందం సభ్యులు జయలక్ష్మి,జల్లెల బాలకృష్ణ స్కీలబ్ బాబు, పైళ్ల ఆశయ్య, జగదీష్, అడివయ్య, సీనియర్ న్యాయవాది కొత్త బుచ్చి రెడ్డి, గూడూరు అంజి రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటి సభ్యులుకొండమడుగు నర్సింహ,

బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరు నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటి సభ్యులు మాయ కృష్ణ, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, సిర్పంగి స్వామి,* బూరుగు కృష్ణారెడ్డి, ఎండి. పాష, గంగదేవి సైదులు, బండారు నర్సింహ, దోడ యాదిరెడ్డి, జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, బబ్బూరి పోషెట్టి, మద్దెల రాజయ్య, వనం ఉపేందర్, బొలగాని జయరాములు, మద్దెపురం రాజు,అవ్వారు రామేశ్వరి, గుండు వెంకటనర్సు, రాచకొండ రాములమ్మ, ఎం .యాదయ్య, ఎంఏ.ఎక్బాల్, గడ్డం వెంకటేష్ ఈర్లపల్లి ముత్యాలు, బండారు శ్రీరాములు, ర్యాకల శ్రీశైలం,పోతరాజు జహంగీర్, తుర్కపల్లి సురేందర్, గందమల్ల మాతయ్య, దాసరి మంజుల, కల్లూరి నాగమణి, మంచాల మధు తదితరులు పాల్గొన్నారు.