ఈ కౌన్సిలర్ బంధువులకు నిబంధనలు వర్తించవా...

ఈ కౌన్సిలర్ బంధువులకు నిబంధనలు వర్తించవా...
  • మున్సిపల్ నిబంధనలు ఉల్లంగించి భవన నిర్మాణం
  • పిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

మెట్‌పల్లి ముద్ర: పట్టణంలో సామాన్యుడు చిన్న చిన్న పొరపాట్లతో మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి భవన నిర్మాణం చేపడితే నోటీసులు జారీ చేసి. అవసరమైతే కూల్చివేసే మున్సిపల్ అధికారులు. ఓ కౌన్సిలర్ బందువులు నిబంధనలకు విరుద్ధంగా పాత భవనం పై నూతనంగా నిర్మాణం చేపట్టిన అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.. వివరాల్లోకి వెళితే పట్టణానికి చెందిన ఓ వార్డు కౌన్సిలర్ బందువులు గోల్ హనుమాన్ దేవాలయం ఏరియాలో పాత భవనం పై నూతనంగా మరో భవనాన్ని నిర్మిస్తున్నారు. టీ ఎస్ బీ పాస్ ప్రకారం పాత భవనం పై నూతనంగా భవనం నిర్మించడం నిబంధనలకు విరుద్ధం అయినప్పటి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భవన నిర్మాణం లో చిన్న పొరపాట్లు ఉన్న సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అధికారులు ఈ భవన నిర్మాణాన్ని అండ్డుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని పట్టణ ప్రజలు అంటున్నారు.గతంలో పలువురు  ఈ భవన నిర్మాణం పై మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు చేయగా మీకు తెలియనిది ఏముంది అది కౌన్సిలర్ కు సంబందించిన నిర్మాణం అన్ని పట్టించుకోవద్దు చూసి చూడనట్లు వదిలేయాలి అని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సామాన్యుని విషయంలో కఠినంగా వ్యవహరించే సంబంధిత అధికారులు ఈ నిర్మాణం పై ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.