ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న కొడుకు దారుణం

ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని కన్న కొడుకు దారుణం
  • ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని
  • తల్లిదండ్రులను చెరువులో తోసేసి
  • కన్న కొడుకు దారుణం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో వృద్ధులైన తల్లిదండ్రులను చెరువులో తోసి హత్యాయత్నానికి పాల్పడిన తనయుడి ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో  చోటుచేసుకుంది. పట్టణంలోని విద్యానగర్ కు  చెందిన రేష్మా బేగం, సలీమ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. అందరికీ వివాహాలయ్యాయి. అయితే కలీమ్ తాగుడుకు బానిసై ఏ పని చేయకుండా జులాయిగా తిరగడంతో వేగలేక భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి డబ్బుల కోసం తల్లిదండ్రులను కలీమ్​ వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి కలీమ్ తల్లిదండ్రులను పట్టణ సమీపంలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి  తోసేశాడు. ఈవిషయం తెలుసుకున్న కలీం బావ  చెరువు వద్దకు చేరుకొని అత్తా మామలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మామ సలీమ్ (55)చనిపోగా, రేష్మా  బేగం చికిత్స పొందుతోంది. రేష్మా  బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ నరేష్ తెలిపారు.