ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌కు మాతృవియోగం

ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌కు మాతృవియోగం

ప్రముఖ నటి మాధురి దీక్షిత్ మాతృమూర్తి స్నేహలతా దీక్షిత్(91) కన్నుమూశారు. ముంబైలోని ఆమె స్వగృహంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. మాధురి, ఆమె భర్త శ్రీరామ్ నేనే ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె తుదిశ్వాస విడిచారు’’ అని పేర్కొన్నారు. వర్లీలోని శ్మశాన వాటికలో మధ్యాహ్నం 3.00 గంటలకు స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

అయితే స్నేహలత మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు.  కాగా, గతేడాది తన తల్లి 90వ పుట్టిన రోజు సందర్భంగా మాధురి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు తల్లికి మించిని ఆప్త మిత్రులు లేరని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆమె సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.