చెరువులోకి కారు... ముగ్గురికి గాయాలు

చెరువులోకి కారు... ముగ్గురికి గాయాలు
Ghatkesar srinidhi college student car accident

రంగారెడ్డి ప్రతి నిధి, ముద్ర: సోమవారం రాత్రి గండిపేట చెరువులోకి కారు దూసుకెళ్లింది.. రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అదుపు తప్పి రోడ్డు పై పల్టీలు కొడుతూ గండిపేట చెరువులోకి దూసుకు వెళ్లిన కారుతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ నార్సింగీ పోలీసులు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం‌ అంటున్న పోలీసులు. ఘటకేసర్ శ్రీనిధి కళాశాలకు చెందిన విద్యార్ధులు తన్మయి, ఈషా, ప్రతీక్ గా గుర్తింపు.