నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చెరువు, ప్రభుత్వభూములను  మింగేస్తున్న కబ్జాదారులు

నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చెరువు, ప్రభుత్వభూములను  మింగేస్తున్న కబ్జాదారులు
Occupiers encroaching on pond, government land under Nizampet Municipal Corporation
  • కలెక్టర్ గారూ చెరువు, ప్రభుత్వ భూములను కాపాడండి....
  • అక్రమ నిర్మాణాలపై పోలీస్ కేసు నమోదైన
  • చర్యలు తీసుకోవడం లేదు.....
  • కలెక్టర్ కు పిర్యాదు చేసిన బిజెపి 

కుత్బుల్లాపూర్(ముద్ర న్యూస్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ని నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని చెరువు, ప్రభుత్వ భూములు కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానిక బిజెపి ఆధ్వర్యంలో ప్రజావాణి లో సోమవారం పిర్యాదు చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాచుపల్లి కోమటికుంట ఎఫ్ టి ఎల్ / బఫర్ జోన్ నందు చెరువును పూడ్చి వేసి అక్రమ నిర్మాణాలపై పోలీస్ కేసు నమోదైన చర్యలు తీసుకోకపోవడంపైదారుమని అన్నారు. మరియు సర్వేనెంబర్ 186 లో ప్రభుత్వ భూమి ఆక్రమణ పై మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందని  వారు ఆరోపించారు.

ఈ సందర్భంగా బిజెపి నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ,కోమటి కుంట (లేక్ ఐ డి: 2822), బాచుపల్లి గ్రామం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు పైన పేర్కొన్న అదే ఎఫ్ టి ఎల్  పరిమితుల్లో తాత్కాలిక టిన్ షెడ్‌లను కూడా నిర్మించారని ఇదే విషయాన్ని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  ఐ & సి ఏ డి డి బాచుపల్లి మండలం, ఇరిగేషన్ సబ్ డివిజన్ నెం.3, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా17/06/2022 ద్వారా ధృవీకరించబడిందని వారన్నారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, బాచుపల్లి పోలీస్ స్టేషన ఈ లేఖ ఆధారంగా చెరువు కబ్జా మరియు నిర్మాణంపై వర్తించే సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నెం 343/2022 నమోదు చేశారని అయితే, ఇప్పటి వరకు ఎఫ్‌టిఎల్ పరిమితుల్లో నిర్మాణంపై ఎటువంటి చర్య/ కూల్చివేత తీసుకోలేదని ఆరోపించారు.

మరియు వాసవి కన్‌స్ట్రక్షన్స్ బ్లాక్ 9ని వాయువేగంతో నిర్మిస్తోందని వాసవి కన్‌స్ట్రక్షన్స్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పటికీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఫిర్యాదు అయినా ఆక్రమణలు మరియు అక్రమ నిర్మాణాలపై విచారణఎందుకు చేయడం లేదని వారు ఆరోపించారు. మరియు చెరువులు పూడ్చి వేసి షెడ్ల నిర్మాణం మరియు రెడీ మిక్స్ ప్లాంట్ మరియు ఎఫ్ టి ఎల్  ప్రాంతల్లో వాసవి కన్స్ట్రక్షన్ వారి నిరంతర అక్రమ నిర్మాణాల  స్పష్టంగా కనిపిస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. అర్థమవుతుంది.ఈ విషయంలో బాచుపల్లిలోని కోమటి కుంటలోని ఎఫ్‌టిఎల్‌/బఫర్‌ జోన్‌ పరిధిలోని  వాసవీ కన్‌స్ట్రక్షన్స్‌ అక్రమ నిర్మాణాలను తొలగించి, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం కాకుండా చెరువు ఎఫ్ టి ఎల్/ బఫర్ జోన్ లో నిర్మాణం జరిగినట్లు పోలీసు కేసు ద్వారా నిర్ధారించారు అని వాసవి కన్స్ట్రక్షన్ రేరా  (రేరా పి 02200002275) మరియు హెచ్ ఎమ్ డి ఏ  (024274/MED/ఆర్1/యు6) అనుమతులకు విరుద్ధంగా జరిగిందని, కాబట్టి నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేసి, నిర్మాణ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా సర్వే నెంబర్ 186 బాచుపల్లి లో ప్రభుత్వ భూమి 2500 గజాలు స్థలం ఆక్రమించుకొని తప్పుడు పత్రాలతో కబ్జా చేసుకుని మరియు రిజిస్ట్రేషన్ చేయించుకొని దర్జాగా నిర్మాణ అనుమతులు పొందిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బిజెపి నాయకులు ప్రసాద్ రాజు, శేషారావు ,లక్ష్మయ్య, ఈశ్వర్ రెడ్డి, అశోక్, లడ్డు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.