Kachiguda-Medak train: తాత్కాలికంగా  కాచిగూడ- మెదక్ రైలు రద్దు

Kachiguda-Medak train: తాత్కాలికంగా  కాచిగూడ- మెదక్ రైలు రద్దు
Kacheguda-Medak passenger Train

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉదయం కాచిగూడ నుండి మెదక్, సాయంత్రం మెదక్ నుండి కాచిగూడ నడిచే రైలు నేటి నుండి మార్చి 1వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. మునుమాక- సావల్యపురం - సంతమాగులూరు స్టేషన్ల మధ్య ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కాగా ఉదయం 5:20 నిమిషాలకు మెదక్ నుండి కాచిగూడ వరకు, అలాగే రాత్రి 7:10 గంటలకు కాచిగూడ నుండి మెదక్ వరకు రైలు యధావిధిగా నడుస్తుందని తెలిపారు.

అనేక ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఉదయం రైలుకు వచ్చి సాయంత్రం వెళ్లే వారు. ఈ రైలు రద్దు కారణంగా ఉదయం కాచిగూడ నుండి మెదక్ వచ్చే వారికి, సాయంత్రం మెదక్ నుండి హైదరాబాద్ వెళ్లే  ప్రయాణికులకు కొంత ఇబ్బంది కలగనుంది.