చేపలు పట్టేందుకు వెళ్లి వలలో చిక్కుకొని ఒకరు గల్లంతు..

చేపలు పట్టేందుకు వెళ్లి వలలో చిక్కుకొని ఒకరు గల్లంతు..

షాద్ నగర్, ముద్ర: చెరువులో చేపట్టేందుకు వెళ్లిన వ్యక్తి కాలువలలో చిక్కుకొని గల్లంతయిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. కావాలోనికుంటతండాకు చెందిన కొడావత్ రాము, సురేష్ ఇద్దరు కలిసి చెరువులో చేపలు పట్టేందుకు శుక్రవారం రాత్రి చెరువు వద్దకు వెళ్లారు రాము కాలు వలలో చిక్కుకొని చెరువులో గల్లంతాయాడని వివరించారు. ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న సురేష్ వెంటనే కుటుంబ సభ్యులకు, తండావాసులకు సమాచారం అందించాడని పేర్కొన్నారు. చెరువులో గల్లంతయిన రాము కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెరువు వద్దకు తండావాసులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పరిసర ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.