రసాభాసగా మారిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పల్లెబాట అద్దుకున్న ప్రజలు, తోపులాట

రసాభాసగా మారిన ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పల్లెబాట అద్దుకున్న ప్రజలు, తోపులాట

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై సొంత పార్టీ బీఆరెస్స్ మహిళా నేత తీవ్ర విమర్శలు చేశారు.వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యే గా గెలుపొందితే నియోజకవర్గంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఎమ్మెల్యే పై పూడూరు మండల బీఆరెస్స్ మహిళా అధ్యక్షురాలు బాలమణి విమర్శించారు.

 పూడూరు మండలం మన్నేగూడలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చేపట్టిన పల్లెబాట  రసాభాసగా మారింది. గ్రామానికి రావొద్దంటూ  కొందరు గ్రామస్తులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీఆరెస్స్ నాయకులకు - గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురి మధ్య తోపులాట జరిగింది.

బీఆరెస్స్ పార్టీ పూడూరు మండల మహిళా అధ్యక్షురాలు బాలమణిపై కూడా బీఆరెస్స్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్నేగూడ గ్రామానికి చెందిన బాలమణి గ్రామ సమస్యలు చెప్పేందుకు వెళ్ళగా మరో బీఆరెస్స్ నాయకుడు తనపై చెయ్యి చేసుకోబోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలు ఓ ఎమ్మెల్లేను ప్రశ్నించొద్దా...ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఎంతా లేకుంటే ఎంతా అంటూ తన ఆవేదన వెళ్ళగక్కింది.మళ్ళీ ఎమ్మెల్యే గా మహేష్ రెడ్డి గెలిస్తే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని బాలమణి దుయ్యబట్టారు. మొత్తంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పూడూరు మండలంలో చేపట్టిన పల్లెబాట ప్రతి గ్రామంలో రసాభాసగా మారింది.