ఆచితూచి టీమిండియా  బ్యాటర్లు 

ఆచితూచి టీమిండియా  బ్యాటర్లు 

అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియం  వేదికగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో  భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. భారత్ జట్టు..లంచ్ సమయానికి 4 వికెట్లను కోల్పోయి 362 పరుగులు చేసింది. క్రీజులో కింగ్ కోహ్లీ (88), శ్రీకర్ భరత్ (25)తో కొనసాగుతున్నారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇంకా టీమిండియా ఆస్ట్రేలియా స్కోర్ కంటే 118 పరుగుల దూరంలో ఉంది.  మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు,. కట్టుదిట్టమైన బౌలింగ్ తో భారత బ్యాటర్లకు పదునైన బంతులు విసురుతున్నారు. ఎలాంటి బంతులు వేసినా..బ్యాటర్లు మాత్రం ఆచితూచి రిస్క్ చేయకుండా ఆడుతున్నారు. ఓవర్ నైట్ స్కోర్ 289/3 నాల్గవ రోజు ఆటను ప్రారంభించింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో దూకుడుగా కనిపిస్తున్నాడు. రవీంద్ర జడేజా, కోహ్లీ కలిసి హాఫ్ సెంచరీ (57) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు వికెట్ల కోసం ఆస్ట్రేలియా బౌలర్లు  కట్టుదిట్టమైన బంతులు వేస్తున్నారు. కానీ టీమిండియా బ్యాటర్లు ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు.

ఇదే క్రమంలోనే ఆల్ రౌండర్ జడేజా  మర్ఫీ బౌలింగ్‎లో ఓ చెత్త షాట్ ఆడటంతో మిడాన్‎లో ఖావాజా చేతికి చిక్కి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో భారత్ జట్టు 309 పరుగుల వద్ద నాల్గవ వికెట్ ను కోల్పోయింది.  జడేజా ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్‎మెన్ శ్రీకర్ భరత్ మరో ఎండ్‎లో విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడుతున్నాడు. ఇక కింగ్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆచితూచి తొచినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు.