ఉరేసుకుని బైక్ మెకానిక్ ఆత్మహత్య

ఉరేసుకుని బైక్ మెకానిక్ ఆత్మహత్య

ప్రేమ వ్యవహారమే కారణం
ముద్ర ప్రతినిధి, మెదక్: యువ మెకానిక్ మెకానిక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ పట్టణం గంగినేని టాకీస్ ఎదురుగా మెకానిక్ షెడ్ లో ఆదివారం ఉదయం వెలుగు చూసింది. చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లికి చెందిన బళ్లాల మహేష్(24) చనిపోయాడు. 


ఆటోమొబైల్ వర్క్ చేస్తు జీవనం సాగిస్తున్నాడు. 
శనివారం రాత్రి 12 నుండి 1 దాకా ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటానని తెలపగా సదరు అమ్మాయి మృతుని మిత్రునికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అర్ధరాత్రి దాటాక వచ్చి చూడగా అప్పటికే ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారంగా భావిస్తున్నారు. విచారణలో అన్ని విషయాలు బయటయటకు రానున్నాయి. మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.