Death Mystery: వీడిన యువకుడి హత్య మిస్టరీ

Death Mystery: వీడిన యువకుడి హత్య మిస్టరీ

కుటుంబ కలహాలు, అక్రమ సంబంధమే కారణం

 చందుర్తి, ముద్ర: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య మిస్టరీ వీడింది. ఈ హత్య కు సంబంధించిన వివరాలను వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మృతుడు రణవేణి గణేష్(30) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన లావణ్యతో  వివాహేతర సంబంధం పెట్టుకొని తరచూ వేధించేవాడని, అదేవిధంగా గణేష్ లావణ్య అక్క కూతురు స్వప్న ని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకొని స్వప్నను కూడా మానసికంగా వేధిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నాడని మనసులో పెట్టుకొని గణేష్ ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రాణవేణి లావణ్య, ఆమె అక్క సింగరవేణి బుచ్చవ్వ, గణేష్ భార్య స్వప్న, స్వప్న అన్న సింగరవేణి హరీష్, లావణ్య భర్త చందు, లావణ్య కుమారుడు శరత్ చంద్ర మొత్తం ఆరుగురు కలిసి గణేష్ కంట్లో కారం కొట్టి  గొడ్డలి, కత్తితో   దాడి చేయగా గణేష్ మృతి చెందాడనే విషయం తెలుసుకొని అందరూ అక్కడ నుంచి పారిపోయారు.

హత్య జరిగిన రోజు నుంచి తప్పించుకు తిరుగుతున్న వారు  శుక్రవారం ఉదయం 7 గంటలకు వేములవాడ బస్టాండ్ లో హరీష్, శరత్ చంద్ర తమ ద్విచక్ర వాహనాల పై ఇద్దరి ఇద్దరిని దింపి, తాము బైకు పై, లావణ్య, బుచ్చవ్వ, చందు బస్ లో పరిపోదాం అనుకొనగా, అప్పటికే వారి కోసం గాలిస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారు హత్య కు ఉపయోగించిన గొడ్డలి, కత్తి ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.