ట్రాక్టర్ ను ఢీకొన్న బైకు  ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ట్రాక్టర్ ను ఢీకొన్న బైకు  ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని మోజర్ల సమీపంలో  సోమవారం రాత్రి ట్రాక్టర్లు వెనుకంటి బైక్ ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వహీద్ (50) అక్కడికక్కడే మృతిచెందగా భాస్కర్ గౌడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తకోట పట్టణానికి చెందిన వీరిద్దరూ మోజర్లకు వంట చేయడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన భాస్కర్ గౌడ్ ను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై తెలిపారు.