తెలంగాణ బీసీ సంక్షేమ సమితి మండల అధ్యక్షుడిగా జంగిలి తిరుపతి నియామకం

తెలంగాణ బీసీ సంక్షేమ సమితి మండల అధ్యక్షుడిగా జంగిలి తిరుపతి నియామకం

ముద్ర ,వీణవంక: జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో బీసీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్వేల్ మధుసూదన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.

తెలంగాణ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర శాఖ ఆదేశంలో పాటిస్తూ బీసీల ఐక్యత ఆర్థిక అభివృద్ధి రాజ్యాధికార సాధన నిమిత్తం పూర్తిస్థాయి కార్యక్రమాలు బాధ్యతాయుతంగా నిర్వహించుట కోసం  మండలంలోని శ్రీరాముల పేట గ్రామానికి చెందిన జంగిలి తిరుపతి యాదవ్ ని వీణవంక మండల అధ్యక్షునిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముంజాల కుమారస్వామి గౌడ్ ప్రకటనలో  తెలిపారు. మండల అధ్యక్షుడిగా నియమించుటకు కృషిచేసిన జిల్లా అధ్యక్షునికి రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు వీణవంక మండల బిసి సోదరులకు జంగిలి తిరుపతి కృతజ్ఞతలు తెలియజేశారు.