చింత చెట్టు పై నుండి జారిపడి వ్యక్తి మృతి

చింత చెట్టు పై నుండి జారిపడి వ్యక్తి మృతి
A man died after falling from pine tree

మోత్కూర్ (ముద్ర న్యూస్): మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని డాబా బంగ్లా వెనుకాల చింత చెట్టు పైనుండి జారిపడి బుడిగే ఎల్లయ్య( 70 )మృతి చెందాడు .స్థానికులు మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చింతకాయ పచ్చడి పెట్టడం కోసం చింత చెట్టు ఎక్కి చింతకాయలు తెంపుతుండగా కాళ్లు జారి కిందపడి అక్కడికక్కడే మరణించినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేసి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వంగాల జానకిరామ్ రెడ్డి తెలిపారు.