ఏర్పాట్లు ఘనం... మురిసిన భక్తజనం

ఏర్పాట్లు ఘనం... మురిసిన భక్తజనం
  • వేములవాడ మహాశివరాత్రి జాతరకు కిక్కిరిసన భక్తులు
  • ఆకట్టుకున్న సంస్కృతిక కార్యక్రమాలు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి సందర్బంగా అధికారులు  చేసిన ఏర్పాట్లతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మహాశివరాత్రి కి భక్తులు వేలాది సంఖ్యలో వేములవాడకు చేరుకున్నారు.


రాజన్న జల ప్రసాదం
లక్షలాది జాతరకు వచ్చిన భక్తులకు రాజన్న జల ప్రసాదం పేరుతో ఉచిత మినరల్ వాటర్ సౌకర్యం కల్పించారు. భక్తులకు ఉచిత రక్షిత నీటిని అందించేందుకు ప్రత్యేక రాజన్న జల ప్రసాదం కేంద్రాలు ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.


పర్మనెంట్ టాయిలెట్ లు

గతంలో ఏర్పాటు చేసే తాత్కాలిక టాయిలెట్ ల స్థానంలో ఈ సారి పర్మనెంట్ టాయిలెట్ లను ఏర్పాటు చేశారు. జాతరలో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పురుషులకు, స్త్రీలకు వేరు వేరు గా శాశ్వత టాయిలెట్ లను ఏర్పాటు చేశారు. టాయిలెట్ ల క్లీనింగ్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు.


మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు

జాతరలో భక్తులకు సౌకర్యాలు సందేహాలను నివృత్తి చేయడం తో వారికి కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు , గైడ్ చేసేందుకు మే ఐ హెల్ప్ యూ కేంద్రాలను జనసమ్మర్ధక ప్రదేశాలు కూడలి లలో ఏర్పాటు చేశారు . గతం కంటే ఎక్కువగా ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో ఈ కేంద్రాలను సందర్శించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

బేబీ ఫీడింగ్ సెంటర్

చిన్నారులకు పాలిచ్చే సౌకర్యార్థం ప్రత్యేకంగా బేబీ ఫీడింగ్ సెంటర్ లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఈ కేంద్రాల గురించి సులభంగా తెలిసేలా పెద్ద అక్షరాలతో కేంద్రం పేరును రాయడమే కాకుండా నిరక్ష్య రాసులు కూడ గుర్తించేలా చంటి పిల్లలకు పాలిస్తున్న తల్లి చిత్రాన్ని కేంద్రం పై పెద్ద చిత్రీకరించారు.


గత ఈతగాళ్ల తో నిరంతర గస్తీ

జాతర కు వచ్చే భక్తుల కు ప్రమాదాల కు దూరంగా ఉండేలా హెచ్చరించడంతోపాటు నీటి ప్రమాదాలకు గురైనప్పుడు కాపాడేందుకు వీలుగా రెండు షిఫ్టుల్లో 24 మంది గత గాళ్లను గుడి చెరువు ధర్మగుండంలలో అందుబాటులో ఉంచారు. 

ప్రతి అంగుళం.... నిఘా నేత్రం తో పరిశీలన

మహాశివరాత్రి జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జాతర మొత్తం కవర్ అయ్యేలా వందలాది సీసీటీవీలను ఏర్పాటు చేసి జాతర పూర్తయ్యే వరకు నిఘా నేత్రాల ద్వారా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిన, భక్తులకు ఇబ్బంది కలిగిన వెంటనే క్షేత్ర సిబ్బంది తో మాట్లాడి నిఘా నేత్రాల ద్వారా పరిశీలిస్తూ అపసవ్యతలను చక్కదిద్దుతున్నారు.

షవర్ బాత్ లతో సులభంగా పుణ్య స్నానాలు

రాజన్న దర్శనం ముందు భక్తులు పుణ్యస్నానం ఆచరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ జాతరలో భక్తులు సులభంగా పుణ్య స్థానాలు ఆచరించేందుకు వీలుగా గుడి చెరువు ప్రాంతంలో షవర్ బాతులను అధికారులు ఏర్పాటు చేశారు. 

ఎక్కడ చూసినా... సూచిక బోర్డులే

ఎవరిని సంప్రదించకుండానే భక్తులను నిర్దేశిత గమ్యస్థానాలకు చేర్చడంలో సూచిక బోర్డులదే ప్రధాన పాత్ర. సూచిక బోర్డుల ప్రాధాన్యతను గుర్తించిన జిల్లా యంత్రాంగం ఈసారి పెద్ద ఎత్తున జన సమ్మర్ధక ప్రదేశాలు, ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులను పెద్ద పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్ ,తెలుగు భాషల్లో ఏర్పాటు చేసింది. దీంతో భక్తులు ఈ సూచిక బోర్డుల ఆధారంగా దర్శనం చేసుకోవడంతో పాటు తిరిగి వారి గమ్య స్థానాలకు సులభంగా చేరుకుంటున్నారు.

ఈ సారి గగన వీక్షణం

హెలికాప్టర్ ద్వారా గగన వీక్షణం చేయాలన్నది ప్రతి ఒక్క భక్తుని కల. ఖర్చుతో కూడుకున్న పనైనప్పటికీ రాజన్నను దర్శించుకున్న భక్తి భావనతో పాటు కొంతమంది భక్తులు హెలికాప్టర్ ద్వారా గగనవీక్షణం చేస్తూ రాజన్న జాతరలో ప్రత్యేక మధుర అనుభూతిగా మలుచుకుంటున్నారు.


వైరల్ గా మారిన సమాచార శాఖ జాతర డ్రోన్ దృశ్యాలు

సుప్రసిద్ధ శైవ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల వాడలో జరిగే మహాశివరాత్రి జాతర దృశ్యాలను మరింత అందంగా ప్రజలకు చూపేందుకు విలువ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా జాతర దృశ్యాలను చిత్రీకరించారు.

వాటిని మీడియా గ్రూప్ లలో పోస్ట్ చేయగా
క్షణాల వ్యవధిలోనే సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. అనేకమంది నెటిజన్లు తమ సామాజిక మధ్య మా ఖాతాల్లో వీటిని పోస్ట్ చేశారు మరోవైపు మీడియా ప్రతినిధులు తమ చానల్లో వీటిని ప్రసారాలు చేశారు. జాతరను స్వయంగా వీక్షించలేని భక్తులు ఈ దృశ్యాలను చూస్తూ తన్మయత్వం పోందుతున్నారు.

సమస్త సమాచారం ఆప్ రూపంలో..

వేములవాడ శివరాత్రి జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సౌకర్యాలు ,అట్లాగే సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం స్థల పురాణం, చరిత్ర మొదలైన వివరాలతో కూడిన సమస్త సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన రూపంలో జిల్లా యంత్రాంగం అందుబాటులో తెచ్చింది. యాప్ లో పొందుపరిచిన సమాచారం ఉపయోగకరంగా ఉండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ అప్లికేషన్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునీ.. సమాచారం ను తెలుసుకున్నారు.

భక్తి పారవశ్యం... శివార్చనం

గుడి చెరువు లో ఏర్పాటు చేస్తున్న శివార్చన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో వందలాది కళాకారులు ప్రదర్శిం చిన ఒగ్గుడోలు, శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనలు, జానపద కళాప్రదర్శనలు, కోలాటాలు,ఒగ్గుడోలు ప్రదర్శనలు భక్తులందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ప్రథమ చికిత్స కేంద్రాలు
జాతరకు వచ్చే భక్తులకు ఆరోగ్యపరంగా ఎట్లాంటి అసౌకర్యం కలిగిన వెంటనే స్పందించి చికిత్స అందించేందుకు వీలుగా ప్రథమ చికిత్స కేంద్రాలను ముఖ్య ప్రదేశాల్లో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది.
వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్య సేవలను అందిస్తున్నారు.


ప్రత్యేక అలంకరణ ఉచిత బస్సులు
జాతరకు వేములవాడ వచ్చే భక్తులను తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవాలయం వద్దకు చేర్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ప్రత్యేకంగా అలంకరించిన బస్సులను అందుబాటులోకి ఉంచింది.
వీటిలో భక్తులకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంది.

అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట భద్రత

మహాశివరాత్రి జాతర లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీస్ శాఖ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. వందలాది మంది రక్షకభటులు భద్రత చర్యల్లో నిమగ్నమయ్యారు. భక్తులకు సులభంగా, వేగంగా దర్శనమయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 

కూడళ్ల అభివృద్ధి

మా శివరాత్రి జాతరను పురస్కరించుకొని సిరిసిల్ల వెళ్లే మార్గంతో పాటు జగిత్యాల వెళ్లే మార్గంలో ప్రధాన కూడళ్ల ను ఆధ్యాత్మికత ఒట్టిపడేలా అందంగా తీర్చిదిద్దారు. వేములవాడ ప్రవేశ ద్వారం అయితే అందంగా తీర్చిదిద్దిన ప్రధాన కోణాలను భక్తులను విశేషంగా కట్టుకుంటున్నాయి.

రాజన్న భక్తులకు హెలిక్యాప్టర్ సేవలు -ప్రారంభించిన ఎమ్మెల్యే రమేష్ బాబు

వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసిన రాజన్న భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలికాప్టర్ సేవలను శనివారం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రారంభించారు. 

అనంతరం ఎమ్మెల్యే దంపతులు హెలికాప్టర్ ద్వారా జాతర ను గగన వీక్షణ చేశారు

ఎమ్మెల్యే  సతీమణి మరియా, జెడ్.పి చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి-రాజు , సెస్ చైర్మన్ చిక్కాల రామారావు , అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ , ఆర్.డి.ఓ శ్రీనివాసరావు లు పాల్గొన్నారు.