కుల గణనతో బీసీలకు న్యాయం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కుల గణనతో బీసీలకు న్యాయం..  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
MLC Jeevan Reddy

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బీసీలకు న్యాయం చేయాలంటే బీసీ కమిషన్ వేసి కులగనున చేయాలని పట్టబద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల్లో ఆయన మాట్లాడుతూ కులగణన చేసేటప్పుడు కులవృత్తి, సామాజిక ,ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ముదిరాజులకు న్యాయం చేయాలంటే బీసీ కులగణన చేసి కమిషన్ నివేదిక ఇవ్వాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇబ్బందులకు గురవుతున్న వర్గం  బీసీలు అని  నాలుగు సంవత్సరాల నుంచి స్వయం ఉపాధి సంబంధించి యాక్షన్ ప్లాన్ లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ సిఎం  ఆలోచనలను ప్రకటనలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చెల చూడాలన్నారు.

అనంతరం ముదిరాజ్ లను బీసీ ఏ లను చేర్చాలని చట్టసభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చించి, కృషి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముదిరాజ్ కుల సంఘ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సన్మానించారు.కార్యక్రమంలో పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జున్ను రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్యసీనియర్ నాయకులు తాటిపర్తి దేవేందర్ రెడ్డి, చందా రాధా కిషన్, మున్ను,కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు గుండా మధు, పీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ చాంద్ పాషా,మారు గంగా రెడ్డి, రాజిరెడ్డి, బీరం రాజేష్, లైసెట్టి విజయ్, పాల్గొన్నారు.