కాంగ్రెస్ నాయకులూ డిల్లీ సీల్డ్ కవర్ సియంలు

కాంగ్రెస్ నాయకులూ డిల్లీ సీల్డ్ కవర్ సియంలు
  • ప్రతి పక్ష నాయకులు జీవన్ రెడ్డి  బిసి లకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి
  • 50 ఏళ్ళ కాలంలో కాంగ్రెస్ పాలనలో బిసి ముఖ్యమంత్రుల పేర్లు చేప్పాలి
  • జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రతి పక్ష నాయకులు జీవన్ రెడ్డి తెలంగాణలో బిసి లకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ గౌడ్ తో కలిసి జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ 50 ఏళ్ళ కాలంలో కాంగ్రెస్ పాలనలో బిసి ముఖ్యమంత్రుల పేర్లు చేప్పాలని, వచ్చే ఎన్నికల్లో బిసికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. డిల్లీ సీల్డ్ కవర్ సియంలు మీరని ఎద్దేవా చేశారు. జగిత్యాల నియోజకవర్గం లో 5 సంవత్సరాల కాలం లో గంగ పుత్ర,ముదిరాజ్ లపై 13 కోట్ల 98 లక్షల నిదులు  ఖర్చు చేయటం జరిగిందన్నారు. గత మీపాలనలో ఎన్ని నిదులు ఇచ్చారో చేప్పాలని ప్రశ్నించారు. 4203 మంది గొల్ల కురుమలకు 85 వేల గోర్లు పంపిణీ చేసి ఉపాధి కల్పించామన్నారు. మీరు మత్స్య కార్మికులను,యాదవులను ఏనాడైనా ఆదుకున్నరా అని ప్రశ్నించారు. రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య లకు 10శాతం ఓ సి లకు పక్కన పెడితే....ప్రతి పంటకు 25 వేల కోట్లు ప్రతి పంటకు బిసి లకే ఇస్తున్నామన్నారు. ఎస్సీ ,బిసి ల అభివృద్ధికోసమే దళిత, బిసి బందు అని, ముదిరాజ్ ల విషయంలో జీవన్ రెడ్డి గారిది కపట ప్రేమ అన్నారు. 

ఎవరూ కులాన్ని ద్వేషిస్తూ మాట్లాడినా తప్పే కౌశిక్ రెడ్డి గారి మాటలను మార్పింగ్ చేశారనీ వారే చెప్తున్నారని అన్నారు. ఎబివిపి నాయకులు పాఠశాలల బంద్ కి పిలుపు ఇవ్వడం భాదాకరం ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాష్ట్రాలు విద్యార్థులు, టీచర్ ల రేషిలో తెలంగాణ కన్న కింది స్థాయిలో ఉందన్నారు. తెలంగాణ లో ప్రభుత్వ పాటశాలలో 15 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటే యూపీ లో 25 మందికి ఒక టీచర్ ఉన్నారు అని అన్నారు. అత్యదిక ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నది తెలంగాణలో మాత్రమే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది అని ఎబివిపి నాయకులు గుర్తించాలని అన్నారు.

లైబ్రరీ ఛైర్మెన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గీతా కార్మికులకు చెట్టు పన్ను రద్దు, హరిత హారం లో ఈత తాటి మొక్కలు నాటడం అభినందనీయమని అన్ని కులాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. యాదవులకు గోర్లు, గంగ పుత్రులు ఉచిత చేప పిల్లల పంపిణీ అందులో భాగమే అని, బిసి వర్గాల అభివృద్ధికి, కుల వృత్తులు అభివృద్ది కి కేసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ కోక పెట్ లో అన్ని కుల సంఘాల భవనాల కు స్థలం కేటాయింపు గొప్ప ఆలోచన అని అన్నారు. ఈ  సమావేశంలో రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం,మాజీ కౌన్సిలర్ బాలే శంకర్,కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్, తోట మల్లికార్జున్ నాయకులు అడువాల లక్ష్మన్,గాదె కార్తిక్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,విద్యార్థి విభాగం అధ్యక్షులు యం ఏ ఆరిఫ్,తదితరులు పాల్గొన్నారు.