ఫోటోగ్రాఫర్ కు ప్రశంస పత్రం

ఫోటోగ్రాఫర్ కు ప్రశంస పత్రం

ముద్ర, మల్యాల: మల్యాల కేంద్రానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ మండలోజు శ్రీనివాస్ ఆర్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీకి (కలకత్తా)కు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రశంస పత్రాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ భాస్కర్ ల చేతులమీదుగా అందజేశారు. కాగా, శ్రీనివాస్ తీసిన ఫోటోలను చూసి కలెక్టర్, ఎస్పీ అభినందించారు.