బిజెపిలో చేరిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..

బిజెపిలో చేరిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్..
Former municipal chair person Boga Shravani joined in BJP

ఢిల్లీలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో చేరిక...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఢిల్లీలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బిజెపి చేరారు. మున్సిపల్ లో కౌన్సిలర్లు మధ్య జరిగిన వివాదం ఎమ్మెల్యే వర్సెస్ బోగ శ్రావణిగా మారి చైర్పర్సన్ పదవికి శ్రావణి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన శ్రావణ్ని బిఎస్పి రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి సంఘీభావం తెలపడంతో పాటు పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. అనంతరం నిజాంబాద్ ఎంపీ అరవింద్ శ్రావణి సంగిభావం తెలిపి  కొద్దిసేపు చర్చించి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.  అలాగే ఈ మధ్య బిజెపి చేరికల కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శ్రావణి కలిసి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి బాధలనుభవించిన శ్రావణి క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని బిజెపిలోకి రావాలని ఆహ్వానించారు.

ఈమేరకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో పాటు భర్త డాక్టర్ ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్ లు ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బిజెపిలో జాయిన్ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా ను కలిశారు.  ఈ సందర్బంగా శ్రావణి మాట్లడుతూ  శ్రావణి బిజెపిలో చేరడంతో జగిత్యాల నియోజకవర్గంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం జనాభా ఎక్కువగా ఉండడం, చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవం బిజెపికి కలిసి వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా శ్రావణి బిజెపి ఎమ్మెల్యే టికెట్ హామీతోనే పార్టీలో చేరినట్టుగా పలువురు భావిస్తున్నారు. వారి వెంట జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజాంబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మూరపల్లి సత్యనారాయణ రావు లు ఉన్నారు.

మోడీ సైన్యంలో సైనికురాలిగా పనిచేస్తా....

మోడీ సైన్యంలో ఒక సైనికురాలిగా పనిచేస్తానని బిజెపిలో చేరిన అనంతరం బోగ శ్రావని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే అణచివేతకు గురై, కన్నీరు పెట్టుకొని తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి, బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానన్నారు. తాను కన్నీటితో రాజీనామా చేసినప్పటికీ బిఆర్ఎస్ పార్టీ నుండి తనకు ఎలాంటి ఓదార్పు లభించలేదని, అయితే ఒక ఆడబిడ్డగా తనను అక్కున చేర్చుకున్న బిజెపి నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భరోసా కల్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతమాత సేవ చేసేందుకు ఒక సైనికురాలిగా పని పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో బిజెపి బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.