కనీసం 25 శాతం కూడా ధాన్యం సేకరించలేదు..

కనీసం 25 శాతం కూడా ధాన్యం సేకరించలేదు..
  • లారీలు రాక పోవడంతో...తూకం లో జాప్యం..
  • రైతుల ధాన్యం కమిషన్ తోనే ఐకేపీ, పాక్స్ కేంద్రాలు నడుస్తున్నాయి...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధాన్యం కొనుగోలు జాప్యం జర్గుతుందని, కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 25 శాతం సేకరించలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట, సారంగాపూర్ మండలం  రెచపల్లీ కొనుగోలు కేంద్రాన్ని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. లారీలు రావడంలేదని ఎమ్మెల్సీ కి రైతుల మొర పెట్టకొగ ఎమ్మెల్సీ జిల్లా అధికారితో  ఫోన్ లో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తమని రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్న సీఎం కెసిఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. అదనపు తూకంతోపాటు, కోత విధిస్తున్నా అధికారులు ఎం చేస్తున్నారని,రైతులే అదనపు తూకం వేయాలనేలా తప్పనిసరి పరిస్థతి కల్పిస్తున్నారు.రైస్ మిల్లర్లను అధికారులు అదుపు చేయకపోవడం బాధ్యతా రాహిత్యం కాదా.. క్వింటాల్ కు 5 కిలోల అదనపు తూకం వేయడం పై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐకేపీ, పాక్స్ కొనుగోలు కెంద్రాలుప్రతి క్వింటాల్ పై కొనుగోలు కేంద్రాలకు రు.12 కమిషన్ పొందుతున్న సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.రైతుల కమిషన్ తో ఐకేపీ పాక్స్ కేంద్రాలు మనుగడ సాగిస్తున్నాయనే విషయాన్ని మరిచిపోతున్నారు.

ఐదు రోజులుగా ధాన్యం తూకం వేయడం లేదని, తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడం లేదని అన్నారు.కనీసం 17 శాతం తేమ శాతం ఉండాల్సింది.. మరింత తగ్గిపోవడంతో రైతులు నష్టపోతుండగా, ప్రతి క్వింటాల్ కు 5కిలోలు అదనపు తూకం వేస్తున్నారు.రైస్ మిల్లర్లు లారీల్లోని ధాన్యం అన్లోడ్ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.ధాన్యం అన్ లోడ్ లో జాప్యం జరుగకుండా టాబ్ ద్వారా, లారీ ఎక్కడ, ఎంతసేపు ఉందనే విషయాన్ని గుర్తించి, జాప్యం జరుగకుండా చర్యలు తీసుకుంటామన్న అధికారులు జాప్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు.రైతులకు దర్మ కాంట రశీదు ఇవ్వడం లేదన్నారు.రైతులే స్వయంగా ధాన్యం కట్టింగ్ కు ఒప్పుకునెలా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.జిల్లా కలెక్టర్ దృష్టి సారించి, ధాన్యం తూకం వేయడంతో పాటు, ధాన్యం తరలించేందుకు  లారీ ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.