ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సతీమణికి మాతృవియోగం

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సతీమణికి మాతృవియోగం

పాడే మోసిన ఎమ్మెల్యే ... పలువురి పరామర్శ 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల ఏమ్మేల్యే  డా. సంజయ్ కుమార్ సతీమణి రాధిక తల్లి చెన్నడి విజయ  అనారోగ్యంతో సోమవారం ఉదయం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మరణించింది. అంత్యక్రియలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని అత్త విజయ పడే మోశారు. మృతి చెందిన విజయ మాజీ మంత్రి, కరీంనగర్ మాజీ ఎంపి  చొక్కారావు పెద్ద కూతురు. ఈ సందర్బంగా సంక్షేమ శాక మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి సతీమణి స్నేహాలత, ఎమ్మెల్సీ భాను ప్రసాద్  రావు, ఎమ్మెల్యే లు సుంకె రవి శంకర్, చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, టేస్కాభ్ ఛైర్మెన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా ఎస్పీభాస్కర్, మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, జిల్లా బిజెపి అధ్యక్షులు సత్యనారాయణ రావు,  నాయకులు, అధికారులు, తదితరులు ఎమ్మెల్యేను కలిసి పరామర్శించారు.