మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది 

మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది 

జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేద్రంలోని చారిత్రాత్మక ఖిల్లాలో ఆదివారం ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంను స్థానికసంస్థల అదనపు కలెక్టర్ మకరంద దంపతులు ప్రారంభించారు. జగిత్యాల జిల్లాలోనిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా సిబ్బందితో కలిసి శ్రమదానం చేసారు.

అదనపు కలెక్టర్ దంపతులు ఖిల్లలో చేత్తను ఊడ్చి, 40 అడుగుల లోతున్న నీటిని సైతం పరిశుభ్రం గావించడానికి బయో ఎంజైమ్స్ చల్లారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్ పర్సన్ గోలి శ్రీనివాస్, డి.ఈ రాజేశ్వర్, మున్సిపల్, పంచాయతీ, మెప్మా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, హరితహారం, స్వఛ్చ భారత్ మిషన్, అటవీశాఖ సిబ్బంది తదితర శాఖల అధికారులు,సిబ్బంది, అర్ పి లు పాల్గొన్నారు