విద్య ద్వారా అన్ని సాధించవచ్చు...

విద్య ద్వారా అన్ని సాధించవచ్చు...

ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుని నైనా జైస్వాల్
వెల్గటూర్,ముద్ర :  విద్య ద్వారా అన్ని సాధించ వచ్చని  టేబుల్ టెన్నిస్ జాతీయ క్రీడాకారిణి నైనా జైస్వాల్ అన్నారు. బుధవారం వెల్గటూర్ మండల కేంద్రంలో గల  ఓ ఫంక్షన్ ప్యాలెస్ లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం కొప్పుల చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల స్నేహలత  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంపాక్ట్ స్టూడెంట్స్ కార్యక్రమని కి  ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  కాగా ఈ కార్యక్రమానికి ధర్మపురి నియోజకవర్గంలోని పలు కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థికి సాధించాలనే పట్టుదలతో పాటుగా,ప్రతి రోజు సాధన చేసి సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు.  

ఎక్కడ చదువుకుం టున్నామన్నది  కాదనీ, ఏం చదివామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు. చరిత్రలో గొప్ప విజయాలు సాధించిన వారిని ఆదర్శంగా తీసుకొని ఆ దిశగా ముందుకు సాగాలని అన్నారు. అనంతరం మేధాసంస్థ ఆవిష్కర్త డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థులు తాను చదువుకునే చదువు నలుగురికి ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి, మంచి సమాజ అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. చిన్న, చిన్న సమస్యలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా నిలబడి ఎదిరించి విజయాన్ని సాధించాలని తెలిపారు.   

మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చలివిపిస్తున్నారని, వారి శ్రమకు గుర్తింపు లభించేలా మీ విద్య ఉండాలని అన్నారు. ప్రపంచం మనల్ని గుర్తించే వరకు పట్టుదలతో, ఒక బలమైన లక్ష్యంతో ముందుకు వెళ్ళాలన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేని నేనూ పదవ తరగతి లో ఫెయిల్ అయినప్పటికీ, పట్టువదలతో చదివి  అమెరికా ఆక్స్ఫర్డ్ లాంటి ప్రపంచస్థాయి యూనివర్సిటీలో ఇంగ్లీష్ పాఠాలు బోధించే స్థాయికి ఎదిగితే, అన్ని సబ్జెక్టుల్లో పాసవుతున్న మీరు ఇంకా ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పారు.

జీవితం పూల పాన్పు కాదనీ అనుకున్న లక్ష్యంలో ముందుకు సాగేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయని వాటిన్నింటిని దాటుకుంటూ వెల్లితే, ఖచ్చితంగా పూలపాన్పు అవుతుందనీ పేర్కొన్నారు.ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన  విద్యార్థుల కు ఎల్ఎం కొప్పుల ట్రస్టు ద్వారా సర్టిఫికెట్లను  భద్రపరచుకోవడానికి అవసరమైన ఫైళ్లను అందజేశారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్, డీఎస్పీ ప్రకాష్, ధర్మపురి సిఐ రమణమూర్తి, డాక్టర్ శరత్, వక్త ముత్యాల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.