రైతులకు లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

రైతులకు లబ్ది చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర:- రైతులకు లబ్ది చేకూర్చడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో విశాలసహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అకాల వర్షాలకు రైతులు పండించిన వరి ధాన్యం తడిసిపోయిందని. అయినప్పటికీ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుందని. వరి ధాన్యం కొనుగోలుకు ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో  ఏ గ్రేడ్ ధాన్యానికి 2 వేల 60 రూపాయలు, బీ గ్రేడ్ ధాన్యానికి 2 వేల 40 రూపాయల మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకి రైతులు వారి ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని  సూచించారు. విశాల సహకార సంఘం చైర్మన్ తీగల లింగారెడ్డి .,ఎంపీపీ మారు సాయి రెడ్డి ,మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి  సుజాత సత్యనారాయణ, విశాల సహకార సంఘం డైరెక్టర్స్ గోరుమంతుల మారుతి, చర్లపల్లి హనుమండ్లు గౌడ్ ,కుంపెల రాములు, జరుపుల రాయల్ ,సుధాకర్ గౌడ్, మహాజన్ నరసింహులు, ఏఎంసి కార్యదర్శి రమణ ,రామ్ రెడ్డి  లు ఉన్నారు.