గత మున్సిపల్ కంటే రెట్టింపు నిధులతో అభివృద్ది పనులు  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

గత మున్సిపల్ కంటే రెట్టింపు నిధులతో అభివృద్ది పనులు  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గత మున్సిపల్ లో అభివృద్ది పనులకు చేసిన ఖర్చు కంటే నేడు రెట్టింపు నిదులు కేటాయింch అభివృద్ధి పనులు చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 20వ వార్డులో 15 లక్షలతో సిసి రోడ్డు, అంగడి బజార్లో 30 లక్షల తో నిర్మించనున్న బట్టల వీధి వర్తకుల కోసం షెడ్ల నిర్మాణానికి నిర్మాణానికి ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి ఎమ్మెల్యే  భూమి పూజ చేశారు. అంతకు ముందు పట్టణ ఓల్డ్ హై స్కూల్ లో మన బస్తి మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. 1.60 కోట్లతో నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను, వీధి వర్తకుల కోసం నిర్మిస్తున్న షెడ్లకు సంబంధించి ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ షిఫ్ట్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జగిత్యాల పట్టణ అభివృద్ధి ఎలా జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ లు అనుమల్ల కృష్ణ హరి, అడువాల జ్యోతి లక్ష్మణ్, క్యాడాసు నవీన్, కమిషనర్ నరేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు ఆకుబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రవి చందు, క్యాషియర్ మానపురి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ భోగ రాజు ,అంగడి బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు ఎలిగేటి నర్సయ్య, సిరిపురం జితేందర్, ఒల్లల గంగాధర్, భోగ జీయర్, కుడిక్యాల సర్వేశ్వర్, దాసరి సుభాష్, అడెపు సత్యం,జయంత్ నేత, సత్యం, తదితరులు పాల్గొన్నారు.