మాస్టర్ ప్లాన్ నుంచి తమ గ్రామాన్ని తొలగించాలని జిపి తీర్మానం

మాస్టర్ ప్లాన్ నుంచి తమ గ్రామాన్ని తొలగించాలని జిపి తీర్మానం
Jagityala Municipal New Master Plan

జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ నుంచి తమ గ్రామాన్ని తొలగించాలని జగిత్యాల అర్బన్  మండలం హస్నాబాద్ గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. పంచాయతీ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో రైతులకు భూములే ఆధారమని అలాంటి భూములను మాస్టర్  ప్లాన్ లో నుంచి తొలగించాలని సర్పంచ్ మునుగోటి లక్ష్మణరావు ఉపసర్పంచ్ దమ్మలత తో పాటు వార్డు సభ్యులందరు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం సర్పంచ్ వార్డ్ సభ్యులతో పాటు గ్రామస్తులంతా మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చి కమిషనర్ నరేష్ కు తీర్మానం ప్రతి, వినతి పత్రం అందజేశారు.