హత్య కేసులో నిందితుల అరెస్ట్

హత్య కేసులో నిందితుల అరెస్ట్
  • ఐదు సెల్ ఫోన్ లు, రెండు ద్విచక్ర వాహనాల స్వాధీనం.
  • వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి రవీందర్ రెడ్డి.

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల పట్టణంలో ఈనెల 16వ తేదీన జరిగిన బీజేవైఎం నాయకుడు మక్కాన్ ప్రవీణ్ సింగ్ హత్య కేసులో పోటుచందా రాహుల్ రాజ్ (20) పోగల రాజేష్ (24) ఓరుగంటి వెంకటేష్ (24) బోయిని కళ్యాణ్ అలియాస్ మంచోడు (25) గుమ్మడి ఋషి కుమార్ (29) అనే   నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి, నిందితుల వద్ద నుండి ఐదు సెల్ ఫోన్ లు , రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈమె రకం కోరుట్ల పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. డి.ఎస్.పి తెలిపిన వివరాల ప్రకారం.పట్టణానికి చెందిన ప్రవీణ్ సింగ్ ను పాత కక్షల నేపథ్యంలో  ఓ వివాహిత ను వేధిస్తున్నాడని అనుమానంతో  ఈ నెల 16వ తేదీన అర్థరాత్రి కొందరు వ్యక్తులు పట్టణంలోని ఐలాపూర్ దర్వాజా వద్ద కాపుకాచి బండరాళ్లతో విచక్షణ రక్షితంగా కొట్టి, చనిపోయాడని భావించి అక్కడినుండి పారిపోయారు.

దీనిని గమనించిన స్థానికులు ప్రవీణ్ బంధువులకు సమాచారం అందించగా ప్రవీణ్ ను పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా సందర్భంలో ఈ నెల 17వ తేదీన మృతి చెందాడు. మృతుని తల్లి పిర్యాదు మేరకు తొమ్మిది మంది వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సందర్భంలో కోరుట్ల సీ ఐ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ సతీష్ కుమార్ లు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తుండగా. వేములవాడకు వెళ్లేదారిలో ఏకిన్ పూర్ శివారులో హత్య చేసిన ఐదుగురు నిందితులను పట్టుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారని. వారి వద్ద నుండి 5 సెల్ ఫోన్ లు, రెండు ద్విచక్ర వాహనాలను, హత్యకు వాడిన బండ రాళ్ళను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందని మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. హత్య కేసులో నిందితులను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న కోరుట్ల సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐ సతీష్ కుమార్ లతోపాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్, డి.ఎస్.పి రవీందర్ రెడ్డిలు అభినందించారు.