ప్రజల సమస్యలు గాలికి వదిలేసి...

ప్రజల సమస్యలు గాలికి వదిలేసి...

అవినీతి అక్రమాలతో పాలిస్తున్న పాలకులు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ దుర్గయ్య

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజల సమస్యలు గాలికి వదిలేసి అవినీతి అక్రమాలతో పాలిస్తున్న పాలకులు ఎవరికోసం ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య ప్రశించారు. మున్సిపల్ సమావేశం అనతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సాధారణ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సమావేశంలో అమరవీరుల సంస్మరణ తీర్మాణము పెట్టడం విడ్డూరకరం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుటలో ముఖ్య భూమిక పోషించిన అమరవీరుల త్యాగఫలితమే, ఆత్మ బలిదానాలు కాకుండా ఉండాలనే సోనియాగాంధీ గుర్తించి ఒకప్రక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని రాష్ట్ర అవతరణ దినోత్సవము రోజున కృతజ్ఞతలు తెలుపవల్సిన బాధ్యత ఉన్నప్పటికి వారి వైఫల్యాలు కప్పి పుచ్చుకొనుటకు దశాబ్ది ఉత్సవాల పేరున ప్రజాధనమును దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

ఉద్యమకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ, మిగులు బడ్జెత్తో ఉన్న రాష్ట్రం దశాబ్ది కాలంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలియజేయడానికా ఈ దశాబ్ది ఉత్సవాలు అని అన్నారు. సి.యం. కె.సి.ఆర్. ఎక్కడకి వెళ్ళినా గ్రామ పంచాయతీలకు రూ. 10లక్షలు ఇచ్చారు కానీ జగిత్యాల పట్టణానికి వచ్చిన సి.యం. మున్సిపాలిటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకు జగిత్యాల పట్టణంపై ఇంత వివక్ష అని ప్రశించారు. ఇందుకోసమేనా జగిత్యాల పట్టణంలో దశాబ్ది ఉత్సావాలు అని ప్రశ్నిచారు. ఈ దశాబ్ది ఉత్సవాల కొరకు పాలకవర్గం గత సమావేశంలో ఉత్సవాల కొరకు జగిత్యాల పట్టణ ప్రజలు ఇంటిపన్నుల ద్వారా కట్టిన ట్యాక్స్ల నుండి 15లక్షల రూపాయలు మంజూరు పొంది ఈ ఉత్సవాలలో విచ్చలవిడిగా పాలక వర్గానికి లెక్కలు తెలుపకుండా అధికారులే కాంట్రాక్టర్ అవతారమెత్తి ప్రజా ధనమును దుర్వినియోగం చేస్తున్నందుకా, మున్సిపల్లో రెవెన్యూ, సానిటేషన్, పట్టణ ప్రణాళిక విభాగం ఇతర శాఖలలో ప్రజలకు జవాబుదారీతనం లేకుండా అవినీతి రాజ్యమేలుతుంది. డబ్బులు లేనిదే పని కావడం లేదని జగిత్యాల పట్టణ ప్రజలందరు కోడైకూస్తుంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఏదేదో సాధించమంటూ దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం కడు శోచనీయమని అన్నారు. ఈ సమవేశంలో కౌన్సిల్ సభ్యులు నక్క జీవన్, ఆసియా సుల్తానా, సహరభాను, పర్హిన్ సుల్తానా, ములస్తం లలిత పాల్గొన్నారు.