జగిత్యాలను అష్టదిగ్బంధనం చేసిన రైతులు ..

జగిత్యాలను అష్టదిగ్బంధనం చేసిన రైతులు ..
farmers protest against Jagityala Municipal New Master Plan

నూతన మాస్టర్ లబ్ధి చేయాలంటూ రోడ్లపై వంటావార్పు

జగిత్యాల, ముద్ర ప్రతినిధి: జగిత్యాల మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు జగిత్యాల పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. మాస్టర్ ప్లాన్ కు  వ్యతిరేకంగా జిల్లా కేంద్రానికి వచ్చే నాలుగు ప్రధాన ప్రధాన రహదారులపై రైతులు  రాస్తారోకో నిర్వహించి వంట వార్పు చేశారు.  జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిపై టి.  ఆర్ నగర్ కెనాల్ వద్ద నరసింగాపూర్, ధరూర్ గ్రామ రైతులు,   జగిత్యాల నిజాంబాద్ జాతీయ రహదారిపై చెలిగల్ వద్ద హస్నాబాద్, అంబర్పేట రైతులు, జగిత్యాల- మంచిర్యాల ప్రధాన రహదారిపై తిప్పనపేట వద్ద తిప్పన్నపేట రైతులు,  జగిత్యాల గొల్లపల్లి రహదారిపై మోతే, తిమ్మాపూర్ రైతులు కూర్చొని అష్టదిగ్బంధనం చేశారు. 

నిలువకుల కిలోమీటర్ల మేర ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది . మున్సిపల్ నూతన మాస్టర్ వల్ల తమ విలువైన భూములు కోల్పోయి.. జీవన ఆధారం  లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని తమ భూములను ఎవరికి ఇచ్చేది లేదని ఎంతవరకైనా తెగించి కొట్లాడుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.