ఏడుపాయలలో యాగశాల ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ఏడుపాయలలో యాగశాల ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మొదటి సారిగా యాగశాలను ఏర్పాటు చేయగా రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణ నడుమ సోమవారం ప్రారంభించారు. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డిలు పాల్గొన్నారు. మంత్రికి రాజగోపురం వద్ద ఈఒ సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.  

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు పుణ్యహవచన తదితర పూజల అనంతరం హోమం, పూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డిఓ సాయిరాం, ఎఎంసి చైర్మన్ వెంకట్రాం రెడ్డి, ఎంపిపి ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ అధ్యక్షులు బాలాగౌడ్, కొల్చారం ఎంపిపి మంజుల, జడ్పిటిసి మేఘమాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.