ఫోటో గ్రాఫర్స్ వర్క్ షాప్

ఫోటో గ్రాఫర్స్ వర్క్ షాప్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ లో ఆదివారం మెదక్ వీడియో గ్రఫి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఉచిత ఫోటో వర్క్ షాప్  నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపల్ హాజరయ్యారు. ఒక చిత్రం ఎన్నో పదాలకు సమానమన్నారు. కౌన్సిలర్ అర్కే శ్రీనివాస్, రాష్ట్ర ఫోటో గ్రాఫర్ అధ్యక్షులు యస్.కె.హుస్సేన్, మెదక్ జిల్లా అధ్యక్షులు బిట్ల నర్సింలు, కోశాధికారి నాగరాజు, జిఅర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మూడల నరేష్ బాబు తదితరులు హాజరయ్యారు.

ఈ వర్క్ షాప్ లో ఫోటో కెమెరాకు సంబంధించిన మెళుకువలు, ఆధునిక టెక్నాలజీ  గురించి రాష్ట్ర అధ్యక్షులు యస్.కే హుస్సేన్ వివరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల అధ్యక్షులు దాసరి శ్రీధర్, మండల ప్రధాన కార్యదర్శి గిరి, కోశాధికారి బండ చంద్ర శేఖర్, ఉపాధ్యక్షులు సూర్య వంశీ, చింతల రవీందర్, స్టూడియో ఇంఛార్జి ప్రదీప్, మాజీ అధ్యక్షులు అడేపు రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి కంచి ఆనంద్, సలహాదారులు పి.సురేందర్, ఎం.లక్ష్మణ్, నవీన్, రాజు, సుమన్, బస్వరాజు, బోయిని శ్రీకాంత్, మహేందర్, విక్రమ్ తదితర ఫోటో గ్రాఫర్లు పాల్గొన్నారు.