బిజెపి సూటుకేసులకు అమ్ముడు పోదు

బిజెపి సూటుకేసులకు అమ్ముడు పోదు
  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:బిజెపి సూట్ కేసులకు అమ్ముడుపోయే పార్టీ కాదని రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.ఆదివారం మెదక్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

గ్రూప్-2 వాయిదా పడి చనిపోయిన ప్రవళిక హత్యను రాజకీయం చేస్తున్నారని మానవతా దృక్పథంతో ఆలోచించకుండా ప్రవళిక మరణాన్ని ప్రేమ వ్యవహారమని  పోలీసులతో స్టేట్మెంట్ లు  ఇప్పించడం  దారుణమన్నారు..చంద్రశేఖర్ రావు పరిపాలనలో ఒక్క నోటిఫికేషన్ రాలేదనీ వచ్చిన నోటిఫికేషన్లకు లీకులు అవుతాయి లేదా కోర్టుకు వెళ్లి స్టే తెస్తారని ఆరోపించారు.చంద్రశేఖర రావుకి ఇష్టమైన నోటిఫికేషన్ వైన్స్ లకు మాత్రం కరెక్ట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.కెసిఆర్ మూడోసారి అధికారంలోకి రావడం కోసమే మేనిఫెస్టోను రూపొందించాడన్నారు. మేనిఫెస్టో మోచేతికి బెల్లం పెట్టినట్టు ఉందని ఆరోపించారు. సూట్ కేసులకు అమ్ముడుపోయే పార్టీ బిజెపి పార్టీ కాదని రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందనీ సిద్ధాంతాన్ని ఆధారంగా లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది అన్నారు.దుబ్బాకలో బుద్ధి చెప్పినట్టే ఇక్కడ కూడా బుద్ధి చెప్పాలి అన్నారు.ఇతర పార్టీలలో మాదిరిగా టికెట్లు ఇవ్వకపోతే వేరే పార్టీలో చేరే నాయకులు లేరన్నారు. బి-ఫామ్ ఎవరికిచ్చినా కష్టపడి పని చేస్తారన్నారు.తెలంగాణ వచ్చిన ప్రజల జీవితాలు మారలేదన్నారు.

జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నాయకులు నందా రెడ్డి, నందు జనార్ధన్ రెడ్డి, నల్లాల విజయ్ కుమార్ నాయిని ప్రసాద్, బెండ వీణ, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.దుబ్బాక నియోజకవర్గనికి సహకరించని మంత్రి గతంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమని అడిగితే మాట దాటవేశాడని  ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. చేగుంట మండలం వడియారం ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాడెం వెంగళరావుపార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ గతంలో చేగుంట మండల పరిషత్, తహసిల్దార్ కార్యాలయల ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు వచ్చారని, మంత్రిని దుబ్బాక నియోజకవర్గనికి, అలాగే మెదక్ రోడ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జి కోసం నిధులు అడిగితే మాట దాటవేసి, మహిళల ఆరోగ్యాలు, ప్రసవాలు కేసీఆర్ కిట్టు గురించి మాట్లాడాడని అభివృద్ధి విషయం పక్కన పెట్టాడన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూపాల్, మాజీ మండల అధ్యక్షుడు పాండు, మాజీ సర్పంచులు బాలచందర్, రఘువీర్రావ్, నాగభూషణం, రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యుడు కరణం గణేష్, నాయకులు జ్ఞానేశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజాగౌడ్, చందాయిపేట మాజీ సర్పంచ్ పబ్బ నాగరాణి నగేష్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.