కమలానికి క్యాడర్ లేదు..

కమలానికి క్యాడర్ లేదు..
  • కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరు!
  • తెలంగాణలో రెండు పార్టీలు డీలా పడ్డాయి
  • కె.సి.ఆర్.. అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
  • ఆర్థిక మంత్రి హరీశ్​రావు
  • నేడు సీఎం కేసీఆర్​మెదక్​పర్యటన

ముద్ర ప్రతినిధి, మెదక్ : ఏకకాలంలో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ నుంచి ప్రగతి శంఖారావం పూరిస్తారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. ఇక్కడి నుంచి రెండు కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారని వెల్లడించారు. నేడు మెదక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, స్టేట్​లీడర్​రాధాకృష్ణ శర్మతో కలిసి మాట్లాడారు.  

  • టేకేదార్, ప్యాకర్స్ కు పింఛన్లు..

దివ్యాంగుల పింఛన్​రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచడం, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇప్పటికే బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తుండగా టేకేదార్, ప్యాకర్స్ విజ్ఞప్తి మేరకు వారికి కూడా ఆసరా పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి మెదక్ లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో 4016 ఇచ్చే కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంబిస్తారన్నారు. అభ్యర్థుల ప్రకటన, హర్షాతిరేఖాలు మా గెలుపు ధీమాకు నిదర్శనమన్నారు. దేశం మొత్తం ఎక్కడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచి కేసీఆర్​కు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

  • కాంగ్రెస్​టిక్కెట్లు అమ్ముకుంటోంది..

రాష్ట్రంలో బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్ కు క్యాండిడేట్ లు లేరని మరోసారి పేర్కొన్నారు. కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటుందని ఎద్దేవా చేశారు. బీజేపీ డీలా పడిపోయిందని హరీశ్​రావు తెలిపారు. బీఆర్ఎస్ అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కావాలంటే కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ,మెడికల్ కాలేజీలు,కుల వృత్తులకు రూ.లక్ష ఇచ్చే పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. కేసీఆర్ వ్యూహాన్ని ఉహించక విపక్షాలు అగమైపోయాయన్నారు. 

  • సీఎం కేసీఆర్​ను ఆశీర్వదించండి..

అసత్య ప్రచారంతో ప్రతిపక్షాలు గెలవాలని చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు మెదక్ జిల్లా ఉన్నా.. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అయిందని, మంజీరా, హల్దీ వాగులపై 14 చెక్ డ్యాములు కట్టినట్లు వివరించారు. 100 కోట్లతో ఘనపురం ఆయకట్టు డెవలప్ చేశామన్నారు. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ రిజర్వాయర్లు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అయిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు కేసీఆర్ పథకాలను కావాలని కోరుతున్నారని తెలిపారు. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించేందుకు సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

  • కేసీఆర్​పర్యటనకు సర్వం సిద్ధం
  • నేడు మెదక్ కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్,  బీఆర్ఎస్ భవన్ ప్రారంభం

సీఎం కేసీఆర్​బుధవారం మెదక్​లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా మంగళవారం మంత్రిహరీశ్​రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కేసీఆర్​హైదరాబాద్​నుంచి రోడ్డు మార్గాన మెదక్​కు రానున్నారు.