సీఎం పర్యటన... బిజెపి, కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

సీఎం పర్యటన... బిజెపి, కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

ముద్ర ప్రతినిధి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లాలో బిజెపి, కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టులు ఆయా పోలీస్ స్టేషన్ లకు తరలించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ సభ్యులు మామిళ్ళ ఆంజనేయులు, పార్టీ శ్రేణులను డబల్ బెడ్ రూమ్ నుంచి ర్యాలీగా వస్తున్న వారిని పిల్లి కోటాల వద్ద అరెస్ట్ చేసి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తరలించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులను అరెస్టు చేసి పాపన్నపేట మండలం లక్ష్మీ నగర్ ఫంక్షన్ హాల్ కు తరలించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి మేము వ్యతిరేకులం కాదన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ... గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావడం బిఆర్ఎస్ పార్టీకి ఆనవాయితీగా మారిందని, వారికి కనివిప్పు కలిగించాలనే ఉద్దేశం కొద్దీ భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తున్నామన్నారు. ముందస్తు అరెస్టులు చేయడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం అన్నారు.