కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు

కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు
  • ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కరెంటు కష్టాలు తప్పవని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హెచ్చరించారు. గ్రామాల్లో ప్రచారం చేయడానికి వెళ్తే కొట్లాటలు తీసుకొచ్చే నీచమైన సంస్కృతిని  మైనంపల్లి హనుమంతరావు తీసుకొస్తున్నారు ప్రజలు గమనించాలని సూచించారు. హవేలీ గణపుర్ ,మెదక్ శుక్రవారం హవవేలి ఘనపూర్ మండలం గంగాపూర్, శంనాపూర్, స్కూల్ తండా, మెదక్ మండలం పాతూర్ తదితర గ్రామాల్లో ప్రచారం  ప్రచారం నిర్వహించారు.

  • ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ....

 
పది సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలోఎవరు వస్తే గొడవలు అవుతున్నాయో ప్రజలు గమనించాలన్నారు. ఒక పార్టీ మీటింగ్ జరిగినప్పుడు  మిగతా పార్టీ వాళ్ళు అడ్డు పడటం సరికాదన్నారు.వాళ్ళు ప్రచారం చేస్తే మా కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. కావాలని కొంతమందిని మాపై ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు.

మైనంపల్లి హనుమంతరావు ప్లేట్లు, గ్లాసులు ఇచ్చి  సేవ చేశానని చెప్పుకుంటున్నాడు,  10 సంవత్సరలుగా మా ప్రభుత్వo హయాంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమలు చేశామన్నారు.13 సంవత్సరాల తర్వాత   డబ్బు సంచులతో వచ్చి  అహంకారంతో  చిన్న పిల్లగాడు  చిన్న పెద్ద తేడా లేకుండా  మాట్లాడుతున్నారని మైనంపల్లి రోహిత్ రావుపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో నేను జై తెలంగాణ  అంటే,  సమైక్యవాదం పాట పాడింది మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఆలోచించి ఓటెయ్యండి. అభివృద్ధికి పాటుపడండని కోరారు.కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ కతం అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అంటున్నాడు.ఉత్తంకుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి రైతుబంధును బంద్ చేయాలని ఫిర్యాదు చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు, మంచి నీళ్ళు, రైతు బందు  బంద్  అవుతాయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో నాయకులు లావణ్య రెడ్డి, హన్మంత్ రెడ్డి, అంజగౌడ్, కిష్టయ్య, మామిళ్ళ ఆంజనేయులు, సాప సాయిలు, పద్మ తదితరులున్నారు.

పాతూరులో అడ్డుకున్న యువకులు

ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని పాతూరు గ్రామంలో ప్రచారం చేయకుండా ద్విచక్ర వాహనాలు అడ్డుపెట్టి యువకులు అడ్డుకున్నారు.ప్రచారం చేయకుండా కర్రలు అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేసిన యువకున్ని బిఅర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.కొద్దిసేపు యువకులకు, బిఆర్ఎస్ నాయకులకు తోపులాట జరిగింది.హవేలీ ఘన్ పూర్  మండలం గంగాపూర్ గ్రామంలో ప్రచారానికి వెళ్లగా  గిరిజనులకు మాత్రమే పోడు భూమి పట్టాలిచ్చారని, దళితులకు ఇవ్వలేరని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని ప్రశ్నించారు.