కానిస్టేబుల్ నాగరాజుకు కన్నీటి వీడ్కోలు

కానిస్టేబుల్ నాగరాజుకు కన్నీటి వీడ్కోలు
A Tearful farewell to Constable Nagaraju
  • స్వగ్రామం జక్కన్నపేటలో అంత్యక్రియలు
  • నివాళులర్పించిన ఇన్స్పెక్టర్ లు, తోటి సిబ్బంది

ముద్ర ప్రతినిధి, మెదక్: రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ బోయిని నాగరాజు అంత్యక్రియలు స్వగ్రామం జక్కన్నపేటలో సోమవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కొల్చారం  రైస్ మిల్ ఎదుట మోటార్ సైకిల్ ను కారు ఢీ కొట్టగా తెలంగాణ  స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ నాగరాజు(38)మృతి చెందిన విషయం తెలిసిందే. యూసఫ్ గూడ తెలంగాణ  స్టేట్ స్పెషల్ పోలీస్ బేటాలియన్ ఇన్స్పెక్టర్ టి.వి. ధర్మారావ్, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మధు, ఎస్ఐలు ప్రశాంత్, శేఖర్, ప్రమోద్ తోటి బేటాలియన్ సిబ్బంది పూలమాలాలు వేసి నివాళులర్పించారు. 

తోటి మిత్రుడిని కోల్పోయామని కన్నీటి పర్యంతమాయ్యారు.  స్వగ్రామం హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, పోలేసు సిబ్బంది అశ్రునాయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించగా కన్నీటి రోదనలు మిన్నంటాయి. మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, సర్పంచ్ సిద్దమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ చామంతుల సత్యనారాయణ, స్నేహ, సాయిరాం యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.