నిత్య జీవితంలో సైన్స్ చాలా ముఖ్యం

నిత్య జీవితంలో సైన్స్ చాలా ముఖ్యం

డిఈఓ రాధా కిషన్ సుడిగాలి పర్యటన
 ముద్ర ప్రతినిధి, మెదక్: నిత్య జీవితంలో ప్రతి మనిషికి సైన్స్ చాలా ముఖ్యమని మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రొ. రాధా కిషన్ పేర్కొన్నారు. మంగళవారం సైన్స్ డే సందర్భంగా మెదక్ మండలం రాజ్ పల్లి, మండల కేంద్రం హవేలీ ఘనపూర్, కూచన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులు తయారు చేసే ప్రదర్శించిన ప్రదర్శనలు ఆయన తిలకించి అభినందించారు. నేటి యుగంలో సైన్స్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల మంచి అవగాహనతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా  పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణ తీరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంవత్సరం మెదక్ జిల్లా 10వ తరగతి ఫలితాల్లో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం అందజేస్తున్న స్నాక్స్, ప్రత్యేక తరగతులు ఎలా జరుగుతున్నాయి, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను మూడు విభాగాలుగా  విభజించి ఉదయం, సాయంత్రం వారితో ఉపాధ్యాయులు మాట్లాడాలని సూచించారు. స్నాక్స్ ఇస్తున్నారా లేదా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. మండల విద్యాధికారి నీలకంఠం, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు శశికళ, శ్రీనివాస్, విజయలక్ష్మి  తదితరులు ఉన్నారు.