కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు

కాంట్రాక్ట్ లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు
  • ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, మెదక్:కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి వారి జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్స్ లో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ లెక్చరర్లతో వెట్టిచాకిరి చేయించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ పాత్ర మరువలేనిదని, ఉద్యమంలో ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులరైజ్ చేసిందన్నారు.

బంగారు తెలంగాణ నిర్మాణంలో లెక్చరర్లు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇటీవల మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశామన్నారు.  తెలంగాణ గెజిటెడ్  లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం మాట్లాడుతూ కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడంలో మంత్రి హరీష్ రావు పాత్ర మరువలేమన్నారు. రెగ్యులరైజ్ కు ముందుగానే పే స్కెల్ ఇప్పించారని కొనియాడారు. గెజిటెడ్ హోదా క