జగన్మోహిని అలంకారంలో శ్రీ లక్ష్మీనరసింహూడు

జగన్మోహిని అలంకారంలో శ్రీ లక్ష్మీనరసింహూడు
  • సాంప్రదాయంగా ఎదుర్కోలు మహోత్సవం
  •  నేడు కళ్యాణోత్సవానికి ముస్తాబు
  • హాజరుకానున్న సీఎం కేసీఆర్ దంపతులు , పలువురు ప్రముఖులు 

యాదగిరిగుట్ట ,ఫిబ్రవరి 27 (ముద్ర న్యూస్) యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ స్వామివారిని జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు .సాయంత్రం అశ్వవాహన సేవలో శ్రీ స్వామి వారు ఊరేగారు. ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం జగన్మోహినిగా అలంకరించి ప్రధాన అర్చకులు నల్లన్ తీగల్ లక్ష్మీ నరసింహ చార్యులు ఆధ్వర్యంలో ఉప ప్రధానార్చకులు అర్చక బృందం పారాయనీకులు అత్యంత వైభవంగా ఆలయ మాడవీధులలో ఊరేగించారు. ఈ వేడుకల్లో చైర్మన్ నరసింహ మూర్తి, జీవో గీత ,డీఈవో దోర్బల భాస్కర శర్మ ,ఏఈవోలు గజ్వేల్ రమేష్ బాబు ,గట్టు శ్రవణ్ కుమార్ గుప్తా, రామ్మోహన్ ,ఆలయ సూపరిండెంట్ సురేందర్ రెడ్డి, వెంకటేశం ,శ్రవణ్ కుమార్, ఇతర అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

జగన్మోహిని అలంకార సేవ విశిష్టతను ప్రధాన అర్చకులు వివరించారు .సాయంత్రం శ్రీ స్వామి వారు అశ్వవాహన సేవలో అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు .శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములలో అత్యంత ప్రాధాన్యత కలిగిన వేడుక ఎదుర్కోలు మహోత్సవం సర్వ సమ్మోహానాకారుడైన శ్రీ స్వామివారు అశ్వ వాన రోడుడై భక్తకోటిని కటాక్షించు తిరువీధి ఉత్సవ సేవలో ఆస్థాన మంటపంలోకి విచ్చేయగా ఒకవైపు అమ్మవారు సర్వాలంకార శోభితురాలై స్వామి అనుగ్రహాన్ని లోకాలకు అందించుటకై విశ్వశాంతికై కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించదలచి నిర్వహించబడు ఎదురుకోలు సన్నాహము అత్యంత సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.

అంతకుముందు సాంస్కృతిక కార్యక్రమాలు ధార్మిక సాహిత్య సంగీత కార్యక్రమాలు జరిగాయి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉద్ఘాతన అనంతరం ప్రధానాలయంలో మొదటిసారిగా బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు .ఈ సందర్భంగా ఆలయ తూర్పు భాగంలో మాడవీధుల్లో కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు .దాదాపు 400 మంది జంటలు 3000 రూపాయల టికెట్ రుసుము చెల్లించి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కళ్యాణ తలంబ్రాలను పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సినీ హీరోలు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇతర ప్రముఖులతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు ఈ తంతులో పాల్గొంటున్నారు అందుకు పోలీసులు ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీ స్వామివారి తిరు కళ్యాణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు.