జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి


హైదరాబాద్, జూన్ 02: జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోలీసు వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగరవేశారు. 

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఈ.వి.డి.ఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈ.ఎన్.సి జియా ఉద్దీన్, ప్రాజెక్ట్ సి.ఇ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు సరోజ, విజయలక్ష్మి, జయరాజ్ కెనడీ, యాదగిరిరావు, సిసిపి దేవేందర్ రెడ్డి, అడిషనల్ సిసిపి శ్రీనివాసరావు, హౌసింగ్ ఎస్.ఇ విద్యాసాగర్, ప్రాజెక్ట్ ఎస్.ఇ లు వెంకటరమణ, రవీందర్ రాజు, ఎస్.డబ్ల్యూ.ఎం కోటేశ్వరరావు, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా.రాంబాబు, చీఫ్ వెటర్నరీ డా. అబ్దుల్ వకీల్, సి.ఎం.హెచ్.ఓ డా.పద్మజ, జాయింట్ కమిషనర్లు శశికళ, సంద్య, ఉమాప్రకాష్, స్పోర్ట్స్ డైరెక్టర్ భాషా, పి.డి సౌజన్య, సెక్రటరీ లక్మిస్, తదితర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.... స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. నీళ్ళు, నిధులు  నియమకాలు మలి దశ  స్వరాష్ట్ర సాధనలో 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ దశాబ్దానికి చేరుకున్నాము. ఉద్యమ నాయకుడు KCR గారు  ముఖ్యమంత్రి కావడం వలన  ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమ పథకాలను వినూత్న పద్దతిలో అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.


GHMCలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన ప్రజా రవాణా కోసం ఆధునిక రోడ్డు వ్యవస్థ, సంక్షేమం, సామాజిక, ఆర్థిక పరమైన అభివృద్ధికి నగర వాసులకు GHMC ద్వారా పూర్తి తోడ్పాటు అందిస్తున్నదన్నారు.

Ward Office:  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజల ముంగిట్లో పరిపాలన అందించాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ KTR గారి ఆలోచన మేరకు వార్డ్ ఆఫీసులను ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.


ప్రజల ముంగిట్లో పరిపాలనతో పాటు సమస్యల విన్నపాలను వేగవంతంగా పరిష్కరించే దిశగా వార్డు కార్యాలయాలు పని చేస్తాయి. ప్రస్తుతం GHMC Head Office, Zonal, Circle మూడంచెల వ్యవస్థ ద్వారా పరిపాలన కొనసాగుతున్నది. మరింత సంతృప్తికరమైన సేవలను అందించేందుకు 4వ పరిపాలన Unit గా వార్డు కార్యాలయాలను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 10వ తేదీన సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడుతుందని తెలిపారు. 


GHMC వ్యాప్తంగా ఉన్న 150వార్డులలో ఏర్పాటు చేసే వార్డు కార్యాలయంలో 10 మంది సిబ్బందిలో వార్డు పరిపాలన అధికారి ప్రధాన భూమిక కలదు. అతనితో పాటుగా Engineering, Entomology, Sanitation, Urban Community, Bioversity, విద్యుత్, జలమండలి సిబ్బంది పని చేస్తూ వివిధ మాధ్యమాలు ద్వారా వచ్చిన పిర్యాదులు సిటిజెన్ చార్టు ప్రకారంగా పరిష్కారం చేస్తారని తెలిపారు.


SRDP:   నగరంలో వివిధ రద్దీ జంక్షన్ లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపర్చుటకు SRDP ద్వారా ఇప్పటి వరకు రూ.33,248.53 కోట్ల వ్యయంతో వివిధ రకాల 35 పనులను పూర్తి చేశారు. అందులో 19 ఫ్లై ఓవర్లు, 7 ఆర్.ఓ.బి లు/ఆర్.యు.బి లు, 5 అండర్ పాస్ లు, 1 Cable bridge, పంజాగుట్ట Bridge, ORR నుండి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తయ్యాయి. మిగతా 13 పనులలో 10 పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.

SRDP రెండోదశ: అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు రావడానికి ఆధునిక రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి రొండోదశ SRDP చేపట్టారు. Traffic రద్దీ గల ప్రాంతాలను గుర్తించి Flyovers, ROB, Under Pass, Grade Separate లు చేపట్టి ప్రజలకు మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థ అందుబాటులో తేవడానికి రూ. 4,305 కోట్ల అంచనా వ్యయంతో 36 పనులను చేపట్టేందుకు ప్రతిపాదించినట్లు వివరించారు.

CRMP:  GHMC వ్యాప్తంగా 9013 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు వందకు వంద శాతం అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన (all weather) రోడ్డు గా గుర్తింపు పొందింది. BT రోడ్డులో అధిక ట్రాఫిక్ రద్దీ గల రోడ్డు 812 కిలో రోడ్డు పొడవు గల రోడ్డు సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం ద్వారా చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో వాహన దారులు ఎలాంటి సమస్యా లేకుండా సాఫీగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు 775.86 కి.మీ పొడవు గల రోడ్డును Re-Carpet చేశారని తెలిపారు.


HRDCL:     ప్రధాన రహదారుల్లో పెరుగుతున్న Traffic రద్దీ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలుగా Missing, Link రోడ్లను చేపట్టి హైదరాబాద్ అర్బన్ సమూహం (HUA) పరిధిలో మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి తేవడానికి  ఇప్పటి వరకు రూ.535.59 కోట్ల వ్యయంతో 38 పనులు చేపట్టి 47.13 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదించగా అందులో 27.30 కిలోమీటర్లు గల 25 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని తలిపారు. 

  
Road Net Work (Engineering Section):    GHMC వ్యాప్తంగా 9,013 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు కలదు. అందులో 68.42 శాతం గల CC రోడ్డు కాగా,  31.58 శాతం అనగా 2,846  కిలో మీటర్లు తారు రోడ్డు ఉన్నదని తెలిపారు.
గత ఆర్థిక (2022-23) సంవత్సరంలో 4790 రోడ్డు పనులు రూ.1274 కోట్లతో చేపట్టగా అందులో రూ.697 కోట్ల విలువ గల 2480 పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోరూ.567కోట్ల విలువ గల 2162 పనులు మంజూరు చేయగా అందులో ఇప్పటి వరకు సుమారు రూ.10 కోట్ల వ్యయంతో 22 పనులు పూర్తయ్యాయన్నారు.

Model Grave Yard: మానవుని చివరి మజిలీ సందర్భంగా దహన సంస్కారాల కోసం వచ్చే బంధువులకు అన్ని వసతులను ఆధునిక పద్దతి ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు 39 వైకుంఠ దామాలను రూ.57 కోట్ల వ్యయంతో చేపట్టగా 29 పనులు పూర్తి కాగా మిగతా పనులు అభివృద్ధి దశలో కలవు. ప్రహరీగోడ నిర్మాణం, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా బాత్ రూములు టాయ్లెట్లు, వాష్ ఏరియా Sitting, Gallery,  బూడిదను భద్రపరిచే గది, Parking, Greenery సౌకర్యం, అవసరమైన చోట Office Place, Shopping Complex, Lighting వసతులు కల్పించినట్లు తెలిపారు. 

Multi Purpose Function Hall:    బీదలు కూడా తమ పిల్లల Marriage లు నామామాత్రం రుసుం చెల్లించి Function లను జరుపుకొనుటకు GHMC సకల వసతులతో కూడిన మల్టీ ఫర్పస్ ఫంక్షన్ హాల్ రూ.95.08కోట్ల అంచనా వ్యయంతో 24 చేపట్టగా 9 Function Hall అందుబాటులోకి వచ్చాయి. మిగతా పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయని తెలిపారు. 


Model Corridors:   గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ నగర స్థాయిలో వసతి కల్పించేందుకు GHMC విశేష కృషి చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను అవశ్యకతను గుర్తించి కావాల్సిన మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేసింది. ఈ నేపథ్యం ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పు గల రోడ్లలో ఈ Model Corridors చేపట్టనున్నారు. నగరవ్యాప్తంగా 29 Model Corridors ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టుటకు GHMC నిర్ణయించింది. మొదటి దశలో రూ.52.72 కోట్ల అంచనా వ్యయంతో 15.54 పొడవు 16 పనులను మంజూరు చేశారు. అందులో 9 పనులు ప్రారంభం కాగా మరో ఐదు పనులు త్వరలో చేపట్టనున్నారు. Model Corridorsలో Parking, Greenery, Vending Zones, Cycle Track ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Pedestrian Friendly Facility City Hyderabad:  పాదచారులు ఇరువైపులా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా రోడ్డు దాటడం కోసం Foot Over Bridge లను నిర్మాణం చేపట్టింది. జిహెచ్ఎంసి ద్వారా గతంలో 20 Foot Over Bridge లను చేపట్టగా ప్రస్తుతం రూ.74.65 కోట్ల వ్యయంతో 22 Foot Over Bridge లను చేపట్టగా 10 పనులు పూర్తయ్యాయి. Foot Path, Foot Over Bridge నిర్మాణాలే కాకుండా నగరంలో ప్రతి Zone లో 2 Junction ల అభివృద్ది, సుందరీకరణ ప్రయోగాత్మకంగా చేపట్టిన 12 పనులతో పాటుగా మరో 102 Junctionల భివృద్దికి ప్రతిపాదించారు. అంతేకాకుండా Hyderabad Metro Rail అధ్వర్యంలో ఏర్పాటు చేసిన 60 Metro Stations వద్ద ఇరువైపులా వెళ్లేందుకు Foot Over Bridge లను చేపట్టి పాదచారుల ప్రమాదాలను నివారించేందుకు భద్రత, రక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

SNDP (STRATEGIC NALA DEVELOPMENT PROGRAMME): వరదల వలన నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. వరద ముంపు నివారణకు శాశ్వతంగా పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి మేరకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. తద్వారా GHMC, దాని చుట్టూ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో ఎదుర్కొంటున్న వరద ముంపు నివారణ కోసం  రూ.985.45 కోట్ల అంచనా వ్యయంతో 57 పనులు మంజూరు చేశారని తెలిపారు. 

అందులో GHMC పరిధిలో రూ.747 కోట్ల అంచనా వ్యయంతో 35 పనులు చేపట్టారు. అందులో ఇప్పటి వరకు 23 పనులు పూర్తి కాగా మిగతా పనులు జూన్ చివరలో పూర్తి అవుతాయి. మిగతా 6 పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు.  


చెరువుల సుందరీకరణ, CSR:  CSR పద్ధతిన 14 చెరువులను అభివృద్ధి చేయడం జరుగుతున్నది. మరో 26 చెరువులను అభివృద్ధికి వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. GHMC పరిధిలో ఉన్న చెరువులలో మురుగు నీరు మళ్లింపుతో పాటు చెరువు పునరుద్దరణ, కట్ట పటిష్టత కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.30కోట్ల వ్యయంతో 16 పనులు మంజూరు అయ్యాయని తెలిపారు. 


Waste to Energy:   హైదరాబాద్ కు నలూవైపులా Waste to Energy Plants ను 100 Mega watts Capacity తో ఏర్పాటు చేయనున్నాం. ఇప్పటికే జవహర్ నగర్ Dump Yard లో 24 Mega Watts  విద్యుత్ తయారు చేస్తుండగా, మరో 24 Mega Watts  మంజూరు కాగా అట్టి పనులు కోనసాగుతున్నాయి. Dindigal లో 14.5, ప్యారానగర్ లో 15, బిబి నగర్ లో 11, యాచారంలో14  Mega Watts Capacity గల Waste to Energy  Plants రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయనున్నామని తెలియజేస్తున్నాను. తద్వారా నగరంలో  రోజు వారి సేకరిస్తున్న చేతను నిల్వ ఉంచకుండా Treatment చేసి విద్యుత్ తయారీకి వినియోగించబడుతుందని తెలిపారు. 

భవననిర్మాణ వ్యర్థాల నిర్వహణ(C&D Plant):   పర్యావరణ పరిరక్షణలో బాగంగా నగరంలో ఏర్పడుతున్న భవన నిర్మాణ, కూల్చి వేసిన వ్యర్థాలను నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నగరం నలువైపులా C&D Recycling Plant ల ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రతి రోజూ 2000 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేయడం జరిగింది. అందుకోసం జీడిమెట్ల, ఫతుల్లగూడ లతో పాటు శంషాబాద్ వైపు శాతంరాయ్,  శామీర్ పేట  తూంకుంటలో  ఒక్కొక్కటి 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రీసైక్లింగ్ చేస్తారని తెలిపారు.


Animal Care Center:   జంతు సంవరక్షణ కోసం నగరంలో 5 ప్రాంతాల్లో Animal Care Center లను ఏర్పాటు చేసి Birth Control శస్త్ర చికిత్స చేయడం జరుగుతున్నది. కుక్కల బెడద, కుక్కకాటు నివారణకు Corporator  లతో High Level Committee  నియమించారు. High Level Committee సిపార్సు చేసిన 26 అంశాలను ఆమోదించి పటిష్ట అమలుకు చర్యలు చేపట్టామని తెలిపారు. 


పెంపుడుజంతువులCrematoriums:  ఫతుల్లగూడలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పెంపుడు జంతువుల క్రిమిటొరోయం నిర్వహించబడుతున్నది. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి KTR ఆదేశాల మేరకు మరో 5 పెంపుడు జంతువుల క్రిమిటోరియాల ఏర్పాటు చేస్తున్నారు. జోన్ కు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 


Dog Park:  దేశంలో మొట్ట మొదటి సారిగా పెంపుడు కుక్కల కోసం కొండపూర్ 1.3 ఏకరాల స్థలంలో  Dog Park ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు. ఈ పెంపుడు కుక్కల పార్కును రూ.1.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పార్కుల్లో అవసరమైన కావాల్సిన వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. 


కుక్కకాటు నివారణకు అవగాహన కార్యక్రమాలు:  కుక్కకాటు నివారణ, కుక్కల బెడద నియంత్రణకు చేయవలసినవి, చేయకూడని అంశాల పై నగర వాసులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. పాఠశాల విద్యార్థుల నుండి వయోజనుల వరకు అధికారులు ముందస్తు జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. 1091 Slum Level Federation, Residential Welfare Association లకు,1066 ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలో చదువుతున్న 2,28,614 విద్యార్థులతో పాటుగా కరపత్రాల ద్వారా కూడా కుక్క కాటు నివారణ, కుక్కల బెడద నుండి తమకు తాము కాపాడు కోవడానికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. 


Entomology - Fogging: నగరంలో విభిన్న ఆధునిక పద్దతి ద్వారా దోమల నివారణకు Fogging చర్యలు చేపడుతున్నారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. 103 Portable యంత్రాలతో పాటు  64 Mounted Vehicles ద్వారా మొత్తం 74 మిషన్ల ద్వారా Fogging చర్యలను Internet Thinking (IOT) సాంకేతిక పద్దతి ద్వారా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేసి  దోమల నివారణకు కృషి చేస్తున్నారని తెలిపారు. 


Basthi Dawakhana:   రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భాగస్వామ్యం, సహకారంతో నగరంలో ప్రజా ఆరోగ్యం కోసం జిహెచ్ఎంసి విశేష కృషి చేస్తున్నది. వివిధ ప్రాంతాల్లో నివసించే బీద ప్రజలకు ఆరోగ్యం కోసం ఎలాంటి రుసుము లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేశారు. అందులో భాగంగా నగరంలో వార్డుకు రెండు చోపున బస్తీ దవాఖానలు ఏర్పాటు కు చర్యలు తీసుకోగా ఇప్పటి వరకు 286  అందుబాటులోకి తేవడం జరిగింది. బస్తీ దవాఖానలో Sugar, BP, X-ray సుమారు 57 వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, ఉచితంగా సేవలు అందించగా ఇప్పటి వరకు 1,70,44,671 మందికి ఆరోగ్య పరిక్షలు నిర్వహించామని తెలిపారు.   


అన్నపూర్ణ కేంద్రాలు: ఆకలితో ఏ ఒక్కరూ కూడా అలమటించకూడదనే ముఖ్య మంత్రి సంకల్పంతో నగరంలో 5రూపాయల భోజన పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. నగరంలో 150 కేంద్రాల ద్వారా రోజుకు 300 బోజనల చొప్పున మొత్తం 45,000 బోజనాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి గత April మాసం వరకు 207.74 కోట్ల ను ఖర్చు చేసి 10,51,00,887 భోజనాలు అందించడం జరిగిందన్నారు. 


క్రీడలు:   క్రీడలను ప్రోత్సహించేందుకు Summer Coaching Campలను ఏర్పాటు చేశారు. 6 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వయస్సు గల వారికి 44 Event లలో 37 రోజుల పాటు 914 Sports Center లను ఏర్పాటు చేసి Summer Coaching Camp లను ఏర్పాటు చేశారు. పిల్లలలో ఉన్న క్రీడ నైపుణ్యత బట్టి అట్టి క్రీడలలో మరింత శిక్షణ కల్పించి వివిధ Tournament లో పాల్గొనే విధంగా GHMC కృషి చేస్తుంది. GHMC ప్రోద్బలంతో చాలా మంది క్రీడాకారులు వివిధ క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

 GHMCలో ఉన్న క్రీడా మైదానాలు దేశంలోగల Metro Polity నగరాలలో లేవు. 521 Play Grounds, 26 Sports Complex, 13 Swimming Pools, 5 Tennis Court, 11 Scatting Rinks, 135  మోడరన్ GYM Fitness Centers ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


TDR:   నగర వాసులకు వివిధ అభివృద్ది పనుల ద్వారా మౌలిక సదుపాయల కల్పన కోసం,  భూసేకరణ చేసి TDR లను జారీచేస్తారు. ఇప్పటి వరకు Slip, Missing రోడ్ల కోసం 388 TDR లను జారీ చేశారు.
నాలా ల వెడల్పు కొరకు 113, సాధారణ రోడ్లు వెడల్పు మరియు HRM కు  842 అధిక మొత్తం లో TDR జారీచేశారు. అలాగే SRDP రోడ్ల వెడల్పు కొరకు 224, ఫార్నేషన్ రోడ్డు 13, చెరువులు, కుంటల అభివృద్ధికి, సుందరీకరణ కొరకు 343 ఇప్పటి వరకు 812 ఎకరాల భూసేకరణ చేసి 9664.67 కోట్ల రూపాయల విలువ గల TDR లను జారీ చేశారని తెలిపారు.

Urban Community Development:   
Bank linkage:    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.492.83 కోట్ల విలువ గల రుణాలను 9531 SHG గ్రూప్ లకు ఇవ్వాలని లక్ష్యం కాగా రూ.498.39 కోట్లను 9304 మందికి Bank రుణాలను పంపిణీ చేశారు. వీరితో పాటుగా 277 PWD మహిళ గ్రూపులకు  344 లక్షల రూపాయల రుణాలు అందించారన్నారు.


PWD సీనియర్ సిటిజన్  పరికరాల పంపిణీ:   నగర వ్యాప్తంగా వివిధ ప్రతిభావంతులు (దివ్యాంగులు), Senior Citizen లకు GHMC ద్వారా రూ.3.89 కోట్ల విలువ గల పరికరాలు, సహాయ పరికరాలు ఉచితంగా పంపిణీ చేయుటకు ఏర్పాటు చేసిన గుర్తింపు క్యాంపుల ద్వారా అర్హులైన 4477 మందిలో లాంఛనంగా 50 మందికి నాతో పాటు Deputy Mayor పంపిణీ చేయగా మిగతా వారికి గతంలో గుర్తింపు Camp లు నిర్వహించిన ప్రదేశాలలో త్వరలో  పంపిణీ చేయనున్నారని తెలిపారు. 


Urban Bio-veracity: నగరంలో నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలో 100 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యం కాగా అట్టి మొక్కలను అవెన్యూ, మీడియన్, మల్టీలెవల్, వర్టికల్ గార్డెన్స్, ట్రీ పార్కులు, సెంట్రల్ మీడియన్, వైకుంఠదామాలు, కాలనీలలో, ఖాళీ స్థలాల్ల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. 

తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా నగరంలో పచ్చదనం పెంపొందింది. 2021 FSI Report ప్రకారం Hyderabad నగరంలో అటవీ విస్తర్ణం పెరిగిందని తెలిపింది. అందుకు Green City of Hyderabad అవార్డు దక్కింది. World Green city, Tree Cityగా పచ్చదనంలో Hyderabad కు అవార్డులు దక్కించుకుందని తెలిపారు.

-సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీచేయడమైనది.