అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ముద్ర, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జామునుంచి భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు అంజన్న దర్శనం కోసం  తరలివచ్చి, మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ ప్రకార మండపంలో అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.

 స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే...
మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆలయంలో అంజన్నను దర్శించుకుని, ప్రతేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వాదించారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, జడ్పిటీసి సభ్యుడు రామ్మోహన్ రావు, మల్యాల సర్పంచ్ సుదర్శన్, సింగిల్ విండో అధ్యక్షులు ముత్యాల రాంలిగారెడ్డి, నాయకులు అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, డిష్ శ్రీనివాస్, మాజీ డైరెక్టర్లు సురేందర్, కొంక నర్షయ్య, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

 నేటి నుంచి ఆలయంలో పవిత్రోత్సవాలు... మార్చి 1 నుంచి 3 తేదీ వరకు కొండగట్టు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. సంవత్సరకాలములో  ఆలయoలో జరిగిన వివిధ లోపముల ప్రాయశ్చితార్థం లోక కల్యాణార్థమై మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంగళవారం రాత్రి 8.15ని"లకు విశ్వక్షేన ఆరాధన,  పుణ్యాహావచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.