ప్రాజెక్ట్ పైనుంచి ఓవర్ ఫ్లో అవుతున్న వరద నీరు - ప్రమాదపు అంచుల్లో కడెం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కడెం ప్రాజెక్టు లో 18 గేట్ల కు గాను 14 గేట్లు ఎత్తివేశారు. మిగిలిన 4 గేట్లు మొరాయించాయి. దీంతో ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువైంది. ఫలితంగా ప్రాజెక్ట్ పై నుంచి నీరు ప్రవహిస్తోంది. ఇన్ ఫ్లో 3.85 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2.42 లక్షల క్యూసెక్కులు. దీనికి తోడు నాలుగు గేట్లు తెరుచుకోకపోవటం మూలంగా జర్మన్ క్రస్ట్ గేట్ల పై నుంచి నీరు ప్రవహిస్తోంది.వర్షం పరిస్థితి ఇలా ఉంటే ప్రాజెక్ట్ కు ముప్పు తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే గనక జరిగితే వేలాది మంది జీవితాలకు ప్రమాదం ఏర్పడనుంది.