రోడ్డెక్కిన బిసి హాస్టల్ విద్యార్థులు

రోడ్డెక్కిన బిసి హాస్టల్ విద్యార్థులు

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలంలోని బూరుగుపల్లి గ్రామంలో బిసి హాస్టల్ విద్యార్థులు శనివారం రోడ్డెక్కారు. హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్లో సరైన భోజనం పెట్టడం లేదని, విద్యార్థుల పట్ల వార్డెన్ ప్రవర్తన సరిగా ఉండడం లేదని ఆరోపించారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ లేదా అడిషనల్ కలెక్టర్ బూర్గుపల్లి హాస్టల్ సందర్శించి సమస్య పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.