50 వేల ఓట్ల మెజార్టీ తగ్గకుండా గెలుస్తాం..

50 వేల ఓట్ల మెజార్టీ తగ్గకుండా గెలుస్తాం..

అసెంబ్లీ సన్నాహక సమావేశంలో నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

హుజూర్నగర్, ముద్ర: 50 వేల మెజార్టీ తగ్గకుండా గెలుస్తామని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ లో తనపై అసత్య ప్రచారం జరుగుతుందని ,ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరు నమ్మరు అన్నారు. రాబోయే ఎన్నికలు హుజూర్నగర్ చరిత్రలో తిరగరాయాలన్నారు. కార్యకర్తలు కోరితేనే పోటీ చేస్తానన్నారు .పద్మావతి నేను మరొక పాతికేళ్లు రాజకీయాల్లో ఉంటానన్నారు. ల్యాండ్, మైనింగ్, మందు మాఫియా తో బి ఆర్ ఎస్ నాయకులు చిల్ల రాజకీయం చేస్తున్నారన్నారు. ఇటీవల మందు మాఫియా తో 40 లక్షలకు పైనే బిఆర్ఎస్ నేత వసూలు చేయడాన్ని ఆయన ఖండించారు. వచ్చే హుజూర్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో తప్పకుండా గెలుస్తానని ఒక ఓటు తగ్గిన రాజకీయం నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ చేశారు. నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజలే తమ కుటుంబ సభ్యులని ఈ సంవత్సరంతో తన ముప్పై ఏళ్ళు రాజకీయం పూర్తవుతుందని అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని వ్యాపారులను, ప్రజలను వేధించలేదని అన్నారు.  బి ఆర్ ఎస్నేతలకు వ్యాపారులు టాక్స్ లు కట్టాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. హుజూర్నగర్ లో జరిగేది లూటీలు ,కమిషన్, దోపిడీ , పని శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో జాతీయ కమిషన్ ,విభజన హామీలు ,రైల్వే లైన్, రక్షణ శాఖలో కీలకంగా పని చేశానన్నారు.


నవంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరుగుతాయని సెప్టెంబర్ లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని కార్యకర్తలు బూతులు వారీగా కమిటీలు వేసుకొని పని చేయాలన్నారు. ప్రతి 100 ఓట్లకు ఒక సామాన్య కర్తను నియమించుకోవాలని పదిమంది సభ్యులతో  ఈనెల19 నుండి 22 సాయంత్రం వరకు బూత్ కమిటీని పూర్తి చేయాలని పనిచేసే   వారినే కమిటీ అధ్యక్షుడిగా ఉంచాలన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గం లో సుమారుగా రెండు లక్షల 30 వేల ఓట్లు ఉన్నాయని 2500 కార్యకర్తలతో కమిటీని వేసి బూత్ కి 10 మందిని నియమించాలన్నారు.BLA బూతు లెవల్ ఏజెంట్ ద్వారానే ఓట్లు చేర్పించే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలన్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వాట్సాప్ ,సోషల్ మీడియా, ట్విట్టర్ , ఫేస్ బుక్, గ్రామ కమిటీ ,బూత్ కమిటీ గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. రానున్న 100 నుండి 150 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా సీరియస్ గా పని చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, సీనియర్ టిపిసిసి ఉపాధ్యక్షులు నిరంజన్ నగేష్, ముదిరాజ్ ,సామల శివారెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు,ఎరగని నాగన్న ,తన్నీరు మల్లికార్జునరావు, భూక్య గోపాల్, కొట్టేసారేశ్వరరావు ,మంజు నాయక్ ,రామిశెట్టి అప్పారావు, అంజన్ రెడ్డి ,సంపత్ రెడ్డి, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.